దీపావళితో ఒకేరోజు రెండు బ్లాక్ బస్టర్ హిట్లు.. ఇక టాలీవుడ్‌లో ఈ మ్యూజిక్ డైరెక్టర్‌కు తిరుగేలేదనుకోండి..!!

by Anjali |   ( Updated:2024-11-04 15:39:39.0  )
దీపావళితో ఒకేరోజు రెండు బ్లాక్ బస్టర్ హిట్లు..  ఇక టాలీవుడ్‌లో ఈ మ్యూజిక్ డైరెక్టర్‌కు తిరుగేలేదనుకోండి..!!
X


దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్‌లో అత్యంత తొందరగా ఎదిగిన డైరెక్టర్లలో జి. వి ప్రకాష్(GV Prakash) ఒకరు అని చెప్పుకోవచ్చు. ఈయన ముందుగా సంగీత దర్శకుడిగా మంచి పేరు దక్కించుకున్నాడు. అంతేకాకుండా హీరోగా, నిర్మాతగా కూడా ఫుల్ బిజీ అయిపోయాడు. ఇప్పుడున్న ఎంతో మంది దర్శకుల్లో సరికొత్త టాలెంటెడ్ సంగీత దర్శకుడి కోసం సెర్చ్ చేస్తున్నారు. తెలుగు సినీ ఇండస్ట్రీలో దేవి శ్రీ ప్రసాద్, తమన్ వంటి ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్లు ఉండగ.. ప్రకాష్ కు వరుస అవకాశాలు రావడం గమనార్హం. అయితే ఈ డైరెక్టర్ సంక్రాంతి కానుకగా వచ్చిన లక్కీ భాస్కర్(Lucky Bhaskar), అమరన్(Amaran) సినిమాలకు సంగీతాన్ని సమకూర్చాడు. ఈ రెండు మూవీస్ ఒకేసారి విడుదలై.. సూపర్ హిట్‌గా నిలిచాయి.

దీపావళి సందర్భంగా అక్టోబరు 31 వ తారీకున రిలీజ్ అయి.. రెండు మూవీస్ కూడా పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్నాయి. ఇవి తెలుగులో మాత్రమే కాకుండా పాన్ ఇండియా రేంజ్ లో విడుదలై.. మంచి సక్సెస్ అందుకున్నాయి. ముఖ్యంగా లక్కీ భాస్కర్ చిత్రానికి ఈయన అందించిన సంగీతం వేరే లెవల్ అని చెప్పుకోవచ్చు. అమరన్ చిత్రానికిచ్చిన బీజీఎం(BGM) ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది. ఇక ప్రకాష్ కు టాలీవుడ్ లో తిరుగేలేదని చెప్పొచ్చు. అంతేకాకుండా వరుణ్ నటిస్తోన్న మట్కా(Matka) సినిమాకు, నితిన్ రాబిల్ హుడ్ మూవీకి కూడా ఈయనే సంగీతాన్ని అందించారు. దీంతో ప్రేక్షకులు జి. వి ప్రకాష్ పై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. మరెన్నో విజయాలు సొంతం చేసుకోవాలని ఈ డైరెక్టర్ ను కొనియాడుతున్నారు.



Read more ...

Jai Hanuman : జై హనుమాన్‌లో టాలీవుడ్ సీనియర్ హీరో.. ఒక్క పోస్ట్‌‌తో క్లారిటీ ఇచ్చిన బ్లాక్ బస్టర్ డైరెక్టర్

Advertisement

Next Story