- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ట్యాప్-టూ-పే చెల్లింపుల కోసం పైన్ ల్యాబ్స్‌తో గూగుల్‌పే భాగస్వామ్యం!
న్యూఢిల్లీ: ప్రముఖ డిజిటల్ చెల్లింపుల సంస్థ గూగుల్‌పే మొదటిసారిగా యూపీఐ ద్వారా 'ట్యాప్-టూ-పే' సేవల కోసం పైన్ ల్యాబ్స్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీనివల్ల వినియోగదారులు తమ కార్డులను ఉపయోగించకుండానే యూపీఐ చెల్లింపులను సులభంగా పూర్తి చేసేందుకు వీలవుతుందని గూగుల్‌పే బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇప్పటివరకు ఈ సదుపాయం కార్డులకు మాత్రమే అందుబాటులో ఉంది. ట్యాప్-టూ-పే ఫీచర్ సదుపాయం ద్వారా కస్టమర్లు గూగుల్‌పే నుంచి పాయింట్ ఆఫ్ సేల్(పీఓఎస్) వద్ద ఫోన్‌ను ఉంచి, ఆ తర్వాత యూపీఐ పిన్ నంబర్‌ను ఎంటర్ చేస్తే లావాదేవీ పూర్తవుతుందని కంపెనీ వివరించింది.
ఈ సదుపాయం ద్వారా క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం, యూపీఐ లింక్ చేయబడిన ఫోన్ నంబర్‌ను నమోదు చేయడం వంటి విధానాల కంటే సులభంగా లావాదేవీ పూర్తి చేయవచ్చని గూగుల్‌పే తెలిపింది. దేశవ్యాప్తంగా పైన్ ల్యాబ్స్ ఆండ్రాయిడ్ పీఓఎస్‌ల వద్ద స్మార్ట్‌ఫోన్ ఉపయోగించి యూపీఐ వినియోగదారులు ఈ సౌకర్యాన్ని ఉపయోగించవచ్చని పేర్కొంది. భారత్‌లో ఫిన్‌టెక్ పరిశ్రమ వేగంగా అభివృద్ధి చెందుతోంది. దీన్ని మరింత వేగవంతం చేసేందుకు పైన్ ల్యాబ్స్‌తో కలిసి దేశీయంగా మొదటిసారిగా ట్యాప్-టూ-పే ఫీచర్‌ను తీసుకురావడం సంతోషంగా ఉందని గూగుల్‌పే బిజినెస్ హెడ్ సజిత్ శివానందన్ అన్నారు.