- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సోషల్ మీడియా వేధింపులకు చెక్.. గూగుల్ సరికొత్త ఫీచర్
దిశ, ఫీచర్స్ : గూగుల్ జిగ్సా విభాగం 'హరాస్మెంట్ మేనేజర్' అనే కొత్త ప్రోగ్రామ్‌ను డెవలప్ చేసింది. మహిళా జర్నలిస్టులకు సాయపడే లక్ష్యంతో రూపొందిన ఈ ప్రోగ్రామ్.. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో ఎదుర్కొనే అభ్యంతరకర కామెంట్స్‌ను నావిగేట్ చేస్తుంది. జర్నలిస్ట్‌లే కాక ఇతర పబ్లిక్ ఫిగర్స్ కూడా ఈ టెక్నాలజీని ఉపయోగించుకోవచ్చని గూగుల్ ప్రకటించింది. 'హరాస్మెంట్ మేనేజర్'ను ఉపయోగించే తొలి వేదిక ట్విట్టర్. అభ్యంతరకర ట్వీట్స్ హైడ్ చేసేందుకు, లిమిట్స్ క్రాస్ చేసే ఎకౌంట్స్‌ను బ్లాక్ చేసేందుకు సాయపడుతుంది. ఈ మేరకు బెదిరింపులు, నెగెటివ్ కామెంట్స్‌తో కూడిన సందేశాలను డ్యాష్‌బోర్డ్‌లోని గ్రూప్స్‌లో స్టోర్ చేస్తుంది. యూజర్ సదరు గ్రూప్స్‌లోని మెసేజ్‌లను పరిశీలించిన మీదట తగిన నిర్ణయం తీసుకోవచ్చు.
అంతేకాదు ఇందులో రాబోతున్న ప్రత్యేక అప్లికేషన్ ద్వారా దుర్వినియోగ సందేశాలను కలిగిన రిపోర్ట్‌ను యూజర్లు కంపైల్ చేయొచ్చు. డాక్యుమెంట్ చేయబడిన ఈ రికార్డ్ చట్టపరమైన చర్యల అమలుకు హెల్ప్ అవుతుంది. ఇది మహిళా జర్నలిస్టులకు ముఖ్యమైన ఫీచర్‌గా పేర్కొన్న గూగుల్ జిగ్సా.. సెన్సిటివ్ ఇష్యూస్ కవర్ చేసే మహిళా జర్నలిస్టులు లింగ ఆధారిత వేధింపులను ఎదుర్కొనే అవకాశముంటుందని, అలాంటి సమయంలో ఇది ఉత్తమ ప్లాట్‌ఫామ్‌గా మారబోతుందని తెలిపింది. జర్నలిస్టులు మాత్రమే కాదు డిజిటల్‌గా వేధింపులకు గురయ్యే కార్యకర్తలు లేదా ప్రజాప్రతినిధులు ఈ ప్రోగ్రామ్‌ను యూజ్ చేసుకోవచ్చు. ఇక జిగ్సా అధ్యయనం ప్రకారం దాదాపు 70% మహిళా జర్నలిస్టులు ఆన్లైన్లో బెదిరింపులు లేదా వేధింపులు ఎదుర్కోగా .. వీరిలో 40% ఉద్యోగం మానేశారు.