మహిళా జర్నలిస్ట్‌లకు ట్విట్టర్ గుడ్ న్యూస్.. సరికొత్తగా 'హరాస్‌మెంట్ మేనేజర్' !

by Harish |
మహిళా జర్నలిస్ట్‌లకు ట్విట్టర్ గుడ్ న్యూస్.. సరికొత్తగా హరాస్‌మెంట్ మేనేజర్ !
X

దిశ, ఫీచర్స్ : గూగుల్ జిగ్సా విభాగం తాజాగా 'హరాస్‌మెంట్ మేనేజర్' అనే ప్రోగ్రామ్‌ను డెవలప్ చేసింది. ఈ సాంకేతికత ప్రధానంగా మహిళా జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకోగా, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఎదుర్కొన్న అభ్యంతరకరమైన కామెంట్స్‌ను నావిగేట్ చేయడంలో సాయపడనుంది. జర్నలిస్ట్‌లే కాకుండా ఇతర పబ్లిక్ ఫిగర్స్ కూడా ఈ టెక్నాలజీని ఉపయోగించుకోవచ్చని ప్రకటించింది.


'హరాస్‌మెంట్ మేనేజర్'‌ను ఉపయోగించే తొలి వేదిక ట్విట్టర్ కానుండగా.. అభ్యంతరకరమైన ట్వీట్స్ హైడ్ చేసేందుకు, లిమిట్స్ క్రాస్ చేసే అకౌంట్స్ బ్లాక్ చేసేందుకు సాయపడుతుంది. ఈ మేరకు బెదిరింపులు, అసభ్యకరమైన వ్యాఖ్యలతో కూడిన సందేశాలుంటే వాటిని డ్యాష్‌బోర్డ్‌లోని గ్రూపుల్లో ఉంచుతుంది. ఈ క్రమంలో సదరు వినియోగదారుడు ఆ గ్రూపుల్లోని మెసేజ్‌లను పరిశీలించి వాటిపై తగిన నిర్ణయం తీసుకోవచ్చు. అంతేకాదు 'హరాస్‌మెంట్ మేనేజర్'‌లో మరో ప్రత్యేక అప్లికేషన్ రాబోతుంది. దీని ద్వారా అన్ని దుర్వినియోగ సందేశాలను కలిగిన నివేదికను కంపైల్ చేసేందుకు వినియోగదారులను అనుమతిస్తుంది. ఇది డాక్యుమెంట్ చేయబడిన రికార్డ్‌గా.. హింసాత్మక బెదిరింపుల వంటి చట్టవిరుద్ధమైన విషయంలో చట్టాన్ని అమలు చేసే వారికి హెల్ప్ అవుతుంది. ఇది మహిళా జర్నలిస్టులకు ముఖ్యమైన ఫీచర్‌గా పేర్కొన్న గూగుల్ జిగ్సా.. సెన్సెటివ్ ఇష్యూస్ కవర్ చేసే మహిళా జర్నలిస్టులు లింగ ఆధారిత వేధింపులను ఎదుర్కొనే అవకాశముంటుందని, అలాంటి సమయంలో ఇది ఉత్తమ ప్లాట్‌ఫామ్‌గా మారబోతోందని తెలిపింది. జర్నలిస్టులు మాత్రమే కాదు డిజిటల్‌గా వేధింపులకు గురయ్యే కార్యకర్తలు లేదా ప్రజాప్రతినిధులు ఈ ప్రొగ్రామ్‌ను యూజ్ చేసుకోవచ్చు.


జిగ్సా అధ్యయనం ప్రకారం దాదాపు 70% మంది మహిళా జర్నలిస్టులు ఆన్‌లైన్‌లో బెదిరింపులు లేదా వేధింపులకు గురి కాగా.. వీరిలో 40% మంది ఉద్యోగం మానేశారని ఓ ప్రకటనలో తెలిపింది. ఈ మేరకు హరాస్‌మెంట్ మేనేజర్ అనేది తరచుగా భయంకరమైన సోషల్ మీడియా కామెంట్స్‌కు ఒక వడపోత సాధనం కాగా ఇది పాత్రికేయ రంగానికి వెలుపల ఉన్న వారికి కూడా ప్రయోజనకరంగా ఉండనుంది.

Advertisement

Next Story

Most Viewed