- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈ ఏడాది రూ. 2.25 లక్షల కోట్లను వెనక్కి తీసుకెళ్లిన విదేశీ పెట్టుబడిదారులు!
ముంబై: భారత స్టాక్ మార్కెట్ల నుంచి విదేశీ మదుపర్లు నిధుల ఉపసంహరణ ఇంకా కొనసాగుతోంది. ప్రస్తుత నెలలో సైతం అమెరికా డాలర్ బలపడటం, అమెరికా మాంద్యంపై పెరుగుతున్న ఆందోళనల మధ్య ఇప్పటివరకు రూ. 7,400 కోట్లకు నిధులను మన మార్కెట్ల నుంచి వెనక్కి తీసుకెళ్లారు. అంతకుముందు జూన్‌లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) రూ. 50,203 కోట్లను ఉపసంహరించుకున్నారు. గతం కంటే ఈసారి ఎఫ్‌పీఐ అమ్మకాలు తక్కువగా ఉన్నప్పటికీ, మెరుగైన మద్దతు లేకపోవడం వల్ల విదేశీ పెట్టుబడిదారుల అమ్మకాల ధోరణి కొనసాగే అవకాశాలు ఉన్నాయని మార్నింగ్ స్టార్ ఇండియా రీసెర్చ్ మేనేజర్ హిమాన్షు శ్రీవాస్తవ అన్నారు.
డిపాజిటరీ గణాంకాల ప్రకారం.. సమీక్షించిన కాలంలో భారత ఈక్విటీ మార్కెట్ల నుంచి ఎఫ్‌పీఐలు రూ. 7,432 కోట్లను ఉపసంహరించుకున్నారు. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకు ఈక్విటీల నుంచి ఎఫ్‌పీఐలు దాదాపు రూ. 2.25 లక్షల కోట్లను వెనక్కి తీసుకెళ్లారు. ఇది దాదాపు 14 ఏళ్ల గరిష్టం. 2008లో రూ. 52,987 కోట్లను ఉపసంహరించుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరగడం, అమెరికా మాంద్యం ఆందోళనలు, డాలర్ బలపడటం, దేశీయంగా ఐటీ దిగ్గజాలు త్రైమాసిక ఫలితాల్లో రాణించకపోవడంతో విదేశీ పెట్టుబడిదారులు భారత మార్కెట్ల నుంచి నిధులను వరుస నెలల్లో వెనక్కి తీసుకెళ్తున్నారు.