- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నాలుగేండ్ల తర్వాత టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్ ఓపెన్.. వారికి చాన్స్..
దిశ, తెలంగాణ బ్యూరో: నాలుగేండ్ల నుంచి తాళం వేసిన టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్ ఎట్టకేలకు తెరుస్తున్నారు. రాష్ట్రంలో కొత్త ఉద్యోగాల భర్తీ నేపథ్యంలో తెలంగాణ పబ్లిక్సర్వీస్కమిషన్(టీఎస్‌పీఎస్సీ) వెబ్‌సైట్‌ను ఓపెన్ చేసింది. 2018 తర్వాత మళ్లీ నాలుగేండ్ల అనంతరం ఈ వెబ్సైట్తెరిచేందుకు నిర్ణయం తీసుకున్నారు. టీఎస్‌పీఎస్సీ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థుల వివరాలను సవరించుకునేందుకు ఇవ్వాల్టి నుంచే అవకాశం కల్పించారు. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు వెబ్‌సైట్ లాక్ఓపెన్కానుంది. ఇప్పటికే రిజిస్ట్రేషన్చేసుకున్న అభ్యర్థులకు ఎడిట్ ఆప్షన్ఇస్తున్నారు. అదే విధంగా కొత్త అభ్యర్థులు కూడా రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇప్పుడు స్థానికతను సవరించుకోవాల్సి వస్తుండటంతో 25 లక్షల మంది అభ్యర్థులు మార్పులు చేసుకోవాల్సి అనివార్యమవుతోంది.
రాష్ట్రంలో ఉమ్మడి 10 జిల్లాలు ప్రస్తుతం 33 జిల్లాలుగా పునర్విభజన చేసిన నేపథ్యంలో రాష్ట్రపతి ఉత్తర్వులు మేరకు అభ్యర్థులు స్థానికతను సవరించుకోవాలని టీఎస్‌పీఎస్సీ వెల్లడిస్తోంది. 33 జిల్లాలు, రెండు మల్టీజోన్లు, ఏడు జోన్లు ఏర్పాటైనందున వాటి ప్రకారం అభ్యర్థులు స్థానికతను ఖరారు చేయాల్సి ఉంది. టీఎస్‌పీఎస్సీ వెబ్సైట్ఓపెన్ చేసుకోగానే.. తమ రిజిస్ట్రేషన్ వివరాలు నమోదుచేసిన తర్వాత ముందుగా స్థానికత వివరాలను సవరించుకోవాలి. టీఎస్‌పీఎస్సీ ఐడీ, పుట్టినతేదీ, 1 నుంచి 7వ తరగతి వరకు చదివిన ప్రాంతంతో పాటుగా ప్రస్తుత 33 జిల్లాలకు అనుగుణంగా వివరాలు ఎడిట్చేయాల్సి ఉంది. అంతేకాకుండా గతంలో నాలుగేండ్ల కిందట నుంచి ఇప్పటి వరకు విద్యార్హతల్లో మార్పులను కూడా సవరించుకోవచ్చు.
ఓటీఆర్‌లో ఎడిట్ చేయాలనుకుంటే వెబ్సైట్లో ఎడిట్ ఓటీఆర్అనే దానిపై క్లిక్‌చేసి, టీఎస్‌పీఎస్సీ ఐడీ, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేయాలి. ఆ తర్వాత ఫోన్ నెంబర్ఎంట్రీ చేస్తే ఓటీపీ వస్తోంది. దాన్ని నమోదు చేస్తే రిజిస్ట్రేషన్ఎడిట్ ఓపెన్అవుతోంది. ఓపెన్అయిన తర్వాత ఎడిట్ చేయాల్సిన వివరాలను కరెక్ట్‌గా నమోదు చేసి, 1 నుంచి 7వ తరగతి వరకు చదివిన జిల్లాలను ఎంపిక చేసి, విద్యార్హతలను నమోదు చేయాలి. అనంతరం అభ్యర్థి ఫొటో, సంతకాన్ని అప్లోడ్ చేస్తే కొత్త ఓటీఆర్జనరేట్ అవుతోంది.
కొత్తవారికీ చాన్స్..
రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో భాగంగా 30,453 పోస్టులకు ఇప్పటికే ఆర్థిక శాఖ అనుమతిచ్చింది. ఈ నేపథ్యంలో టీఎస్‌పీఎస్సీ కొత్త అభ్యర్థుల నమోదుకు అవకాశం కల్పించింది. టీఎస్‌పీఎస్సీ వెబ్సైట్ఓపెన్ చేయగానే న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్‌చేసి, మొబైల్నెంబర్ఎంట్రీ చేసిన తర్వాత ఓటీపీని నమోదు చేయాలి. అప్లికేషన్‌ఫారంలో వ్యక్తిగత సమాచారం, చిరునామా, ఈ మెయిల్ఐడీ, 1 నుంచి 7వ తరగతి వరకు చదివిన జిల్లాల వివరాలు, విద్యార్హతలను ఎంట్రీ చేయాలి. తర్వాత అభ్యర్థి ఫొటో, సంతకం అప్లోడ్చేయాల్సి ఉంటోంది. ఈ వివరాలన్నీ సబ్మిట్చేసిన తర్వాత టీఎస్‌పీఎస్సీ ఐడీ క్రియోట్అవుతోంది. దాన్ని డౌన్‌లోడ్‌చేసుకోవాలి. అదే నిరుద్యోగులకు ఆధార్ కార్డు.