Arjun -Malaika: ఎట్టకేలకు మలైకాతో బ్రేకప్‌పై మౌనం వీడిన అర్జున్ కపూర్.. షాకింగ్ కామెంట్స్ వైరల్

by Hamsa |
Arjun -Malaika: ఎట్టకేలకు మలైకాతో బ్రేకప్‌పై మౌనం వీడిన అర్జున్ కపూర్.. షాకింగ్ కామెంట్స్ వైరల్
X

దిశ, సినిమా: బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్(Arjun Kapoor) తనకంటే 12 ఏళ్లు పెద్దదైన మలైకా(Malaika Arora)తో డేటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. వీరిద్దరు పలు పార్టీలు, ఫంక్షన్లకు జంటగా హాజరై సందడి చేశారు. అంతేకాకుండా పలు వెకేషన్స్‌కు వెళ్లి ఫుల్ ఎంజాయ్ చేసిన ఫొటోలను సోషల్ మీడియా(Social Media)లో షేర్ చేసి రచ్చ సృష్టించారు. అయితే నిత్యం వీరికి సంబంధించిన వార్త లెన్నో వైరల్ అయినప్పటికీ ఈ జంట స్పందించలేదు. ఈ క్రమంలో.. మలైకా(Malaika Arora), అర్జున్ బ్రేకప్ చెప్పుకున్నారని వార్తలు వైరల్ అయ్యాయి.

తాజాగా, దీపావళి పార్టీలో పాల్గొన్న అర్జున్ కపూర్(Malaika Arora) రిలేషన్‌షిప్ స్టేటస్‌పై షాకింగ్ కామెంట్స్ చేశారు. మీరు రిలేషన్‌లో ఉన్నారా? అని అడగ్గా.. దానికి అర్జున్ (Arjun Kapoor) స్పందిస్తూ.. ‘‘లేను ఒంటరిగా, ప్రశాంతంగా ఉన్నాను’’ అని చెప్పాడు. దీంతో ఈ విషయం తెలుసుకున్న వారంతా షాక్ అవుతున్నారు. కాగా, అర్జున్(Arjun Kapoor) సినిమాల విషయానికొస్తే.. ‘సింగం అగైన్’(Singham Again) మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇందులో కీలక పాత్రలో కనిపించనున్నారు. అయితే ఈ సినిమా నవంబర్ 1న థియేటర్స్‌లో గ్రాండ్‌గా విడుదల కాబోతుంది.

Advertisement

Next Story