RAMJAN FASTING TIPS: రంజాన్‌ మాసంలో ఫాస్టింగ్.. అసిడిటీ ప్రాబ్లమ్‌ నుంచి ఇలా తప్పించుకోండి?

by Anjali |
RAMJAN FASTING TIPS: రంజాన్‌ మాసంలో ఫాస్టింగ్.. అసిడిటీ ప్రాబ్లమ్‌ నుంచి ఇలా తప్పించుకోండి?
X

దిశ, వెబ్‌డెస్క్: పవిత్రమైన రంజాన్ మాసం (Ramadan) ప్రారంభమైంది. ముస్లింలు జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో ఇది ఒకటి. రంజాన్ అనేది ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు (Muslims) ఉపవాసం పాటించే ఇస్లామిక్ పవిత్ర మాసం. ఈద్-ఉల్-ఫితర్-రంజాన్ (Eid-ul-Fitr-Ramadan) నెల చివరిలో ఈద్ పండుగ జరుపుకుంటారు.

ఈ మాసంలో ముస్లింలు అంతా ఉపవాస దీక్షలను ఆచరిస్తారు. ఈ పండగ నెలవంక దర్శనం అనంతరం స్టార్ట్ అవుతుందన్న విషయం తెలిసిందే. సమస్త మానవాళికి మార్గనిర్దేశంగా ఖురాన్ గ్రంథాన్ని (Quran) అందించినందుకు కృతజ్ఞతతో ముస్లింలు నెలరోజులు విధిగా ఉపవాసాలు ఉంటారు.

అంతేకాకుండా దానధర్మాలు (Charities) కూడా చేస్తారు. ఈ పవిత్ర మాసంలో తెల్లవారుజాము నుంచి సూర్యాస్తమయం (Sunset) వరకు ఉపవాసం ఉంటారు. అప్పటివరకు ముస్లింలు వాటర్ కూడా తాగరు. ఎంతో భక్తితో కఠిన ఉపవాసాలు ఉంటారు. ఇఫ్తార్ అనంతరమే వీరు తింటారు. అయితే ఈ క్రమంలో కొంతమందికి అసిడిటీ ప్రాబ్లమ్ తలెత్తుతుంది.

గ్యాస్ (Gas)రావడం, కడుపు ఉబ్బరం (Stomach bloating) వంటి సమస్యలు తలెత్తుతాయి. కాగా ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఆహార నిపుణులు చెప్పిన ఈ చిట్కాలు పాటించండి. ఇఫ్తార్ తర్వాత ఎసిడిటీ (Acidity)అధికంగా ఉండే సోడాలో బ్లాక్ సాల్ట్ (Black salt) అండ్ లెమన్ జ్యూస్ (Lemon juice) కలుపుకుని తాగండి. లేకపోతే పార్ల్సీ లీవ్స్ వాటర్ (Parsley Leaves Water) లో వేసి మరిగించి.. వడకట్టి తాగండి.

కేవలం నిమ్మకాయ రసం (lemon juice) కూడా తాగొచ్చు. దీనిలో విటమిన్ సి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ (Antioxidant) ఫుడ్ ను త్వరగా జీర్ణమయ్యేలా చేస్తుంది. పుల్లటి తేన్పులు వంటివి వస్తే.. ఒక స్పూన్ సొంపు పొడిని గోరువెచ్చని వాటర్ లో వేసి తాగండ. అలాగే ఆవాలు వేడి నీటిలో వేసి.. కడుపు వద్ద రాయండి.

వీటితో పాటు జీలకర్ర (cumin) అండ్ బ్లాక్ సాల్ట్ పొడి గోరువెచ్చని నీటితో వేసి తాగండి. అలాగే నిమ్మరసం, నల్ల ఉప్పు, అల్లం రసం వేసి కలిపి తాగితే.. రంజాన్ మాసంలో ఎటువంటి సమస్య లేకుండా ఆరోగ్యంగా ఉంటారు. రోజంతా యాక్టివ్ గా ఉంటారని ఆహార నిపుణులు చెబుతున్నారు.

గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన సం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సంప్రదించగలరు.

Advertisement
Next Story

Most Viewed