- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
రెండు చోట్ల ఎక్సైజ్ అధికారుల దాడులు.. భారీగా గంజాయి

దిశ, కంది: జిల్లా ఎక్సైజ్ సూపరిండెంట్ గాయత్రి దేవి ఆదేశాల మేరకు స్థానిక ఎక్సైజ్ అధికారులు రెండు చోట్ల దాడులు చేయగా ఒకరి వద్ద 5.5 కిలోల ఎండు గంజాయి, మరొకరి వద్ద 50 గ్రాముల ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. సంగారెడ్డి ఎక్సైజ్ సీఐ మధుబాబు ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. మంగళవారం తెల్లవారుజామున మునిపల్లి గ్రామం లోని మాదిరే నర్సింహులు ఇంట్లో సోదా చేయగా వారి వద్ద సుమారు 5.5 కిలోల ఎండు గంజాయి లభించింది. ఇట్టి గంజాయిని నిందితుడు తన స్వంత పొలంలో పండించి ఎండు గంజాయిగా మార్చి ఇంటిలో నిలువచేసుకొన్నట్లు అంగీకరించారని తెలిపారు.
అలాగే సదాశివపేట పట్టణ శివారులో డప్పు దేవయ్య మునిపల్లె గ్రామం, పులిమామిడి ప్రవీణ్ కుమార్ గుమడిదల, సాయి కిరణ్ సదాశివపేట వాస్తవ్యుడు. వ్యక్తులు గంజాయిని సేవిస్తూ పట్టుబడ్డారు. వీరి వద్ద సుమారు (50) గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈ నలుగురు నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఆయన వివరించారు. పట్టుబడ్డ రెండు గంజాయి ధర బహిరంగ మార్కెట్లో సుమారు 2.5 లక్షల వరకు ఉంటుందని ఆయన చెప్పారు. ఈ దాడుల్లో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.