కూతురి ఫిర్యాదుతో పూడ్చి పెట్టిన శవానికి పరీక్షలు

by Vinod kumar |
కూతురి ఫిర్యాదుతో పూడ్చి పెట్టిన శవానికి పరీక్షలు
X

దిశ, పరిగి: పూడ్చి పెట్టిన శవాన్ని వెలికితీసి పోస్టుమార్టం చేసిన ఘటన కుల్కచర్ల మండలం రాంపూర్‌లో చోటు చేసుకుంది. కుల్కచర్ల ఎస్ఐ గిరి తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని రాంపూర్​ గ్రామానికి చెందిన జి. అనంతమ్మ(45)కు ఒక కుమారుడు, కూతురు ఉన్నారు. కుమారుడు వృత్తి రీత్యా హైదరాబాద్‌లో ఉంటున్నాడు. కూతురు పెళ్లి చేసుకొని చిత్తూరులో ఉంటుంది. కాగా అనంతమ్మ ఈ నెల 10న మృతి చెందింది. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న కుమారుడు రాంపూర్ వచ్చి అంత్యక్రియలు నిర్వహించాడు. అనంతమ్మ కూతురు సోమవారం రాంపూర్‌కు చేరుకుంది. తన తల్లి అనంతమ్మ మృతి పట్ల అనుమానం ఉందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. తహశీల్దార్ రమేష్, వైద్యాధికారి మురళీకృష్ణ, సిబ్బంది ప్రవీణ్​కుమార్ ల సమక్షంలో పూడ్చి పెట్టిన శవాన్ని సోమవారం వెలికితీసి శవ పరీక్షలు నిర్వహించారు. అనంతరం శవాన్ని పూడ్చి పెట్టారు.

Advertisement

Next Story