ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య

by Manoj |   ( Updated:2022-04-10 14:45:00.0  )
ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య
X

దిశ, మేడ్చల్ టౌన్ : ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం అంతక్పేట గ్రామానికి చెందిన ఎల్లయ్య, కవిత దంపతుల కూతురు బండారి సాత్విక(19) గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ కండ్లకోయలోని సీఎంఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో ఈసీఈ ద్వితీయ సంవత్సరం చదువుతుంది. అక్కడే ఉన్న కళాశాల వసతి గృహంలో ఉంటూ చదువుకుంటోంది.

ఆదివారం ఉదయం 11 గంటల ప్రాంతంలో స్నానాల గదిలోకి వెళ్లిన సాత్విక చాలా సేపటి వరకు బయటకు రాకపోవడంతో తోటి విద్యార్థినులు వార్డెన్‌కు సమాచారం ఇచ్చారు. ఆమె సిబ్బంది సహాయంతో బలవంతంగా తలుపు తెరిచి చూడగా ఫ్లోర్‌కు ఉన్న రాడ్‌కు చున్నితో ఊరేసుకున్నట్టు గుర్తించారు. వెంటనే ఆమెను సీఎంఆర్ దవాఖానకు, ఆ తర్వాత అక్కడి నుంచి గాంధీ ఆసుపత్రికి తరలించారు. విద్యార్థిని ఆత్మహత్యకు కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story