2024 నాటికి ప్రపంచంలోనే మొదటి ట్రిలియనీర్‌గా ఎలన్ మస్క్!

by Harish |
2024 నాటికి ప్రపంచంలోనే మొదటి ట్రిలియనీర్‌గా ఎలన్ మస్క్!
X

వాషింగ్టన్: ఇప్పటివరకు ధనవంతుల జాబితాను చూసినప్పుడు మిలియనీర్లు, బిలియనీర్లు అని మాత్రమే చూసిన ప్రజలు త్వరలో ట్రిలియనీర్లను చూసే సమయం వచ్చిందని ఓ నివేదిక అభిప్రాయపడింది. ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్ల ధోరణిని గమనిస్తే ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా ఉన్న టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ మొదటి ట్రిలియనీర్‌గా అవతరించవచ్చని ప్రముఖ మేనేజ్‌మెంట్ సంస్థ టిపాల్టి అప్రూవ్ నివేదిక తెలిపింది. ఆయన ఈ ఘనతను 2024 నాటికి సాధించవచ్చని నివేదిక అంచనా వేసింది. ఫోర్బ్స్ అంచనాల ప్రకారం.. ఎలన్ మస్క్ సంపద 260 బిలియన్ డాలర్లు(దాదాపు రూ. 20 లక్షల కోట్లు)గా ఉంది. జెఫ్ బెజోస్ 190 బిలియన్ డాలర్ల(రూ. 14.5 లక్షల కోట్ల)తో రెండో స్థానంలో ఉన్నారు.

2017 నుంచి ఎలన్ మస్క్ సంపద ప్రతి ఏటా 127 శాతం వృద్ధి అవుతోందని, దీనికి తోడు ఇప్పటికే మెరుగైన లాభాలతో ఉన్న టెస్లా కారు కాకుండా, స్పేస్ఎక్స్ కంపెనీ నుంచి భవిష్యత్తులో ఎలన్ మస్క్ భారీగా లాభాలను అందుకోనున్నట్టు నివేదిక అంచనా వేసింది. ఈ నేపథ్యలో 2024 నాటికి ప్రపంచంలోనే మొదటి ట్రిలియనీర్‌గా ఎలన్ మస్క్ ఉండనున్నట్టు వెల్లడించింది.

Advertisement

Next Story

Most Viewed