TDP: పునర్ వైభవానికి కృషి..ఆన్‌లైన్‌లో టీడీపీ సభ్యత్వ నమోదు

by Mahesh |   ( Updated:2022-04-21 14:26:57.0  )
TDP:  పునర్ వైభవానికి కృషి..ఆన్‌లైన్‌లో టీడీపీ సభ్యత్వ నమోదు
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో టీడీపీ పునర్ వైభవానికి తీసుకురావడమే తమ లక్ష్యమని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బక్కని నర్సింహులు పేర్కొన్నారు. వర్చువల్ పద్దతి ద్వారా గురువారం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆన్‌లైన్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఎన్టీఆర్ భవన్ లో సభ్యత్వ నమోదు కరపత్రాలను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా నర్సింహులు మాట్లాడుతూ టీడీపీ ఆవిర్భవించిందే తెలంగాణలో అన్నారు. కుతుబ్ షా తర్వాత హైదరాబాద్ ను అభివృద్ధి చేసింది చంద్రబాబే అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ పోలిట్‌బ్యురో స‌భ్యులు చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి, రాం మోహ‌న్ రావు, చిలువేరు కాశీనాథ్‌, తిరున‌గ‌రి జ్యోత్స్న‌, కాట్ర‌గ‌డ్డ ప్ర‌సూన , జ‌క్క‌లి అయిల‌య్య యాద‌వ్ , ప్రకాశ్ రెడ్డి, నాయకులు, కార్య‌క‌ర్త‌లు పాల్గొన్నారు.



Next Story