- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీడీపీ హయాంలో.. పెగాసెస్ కొనలేదు: వెంకటేశ్వరరావు
దిశ, ఏపీ బ్యూరో: టీడీపీ హయాంలో పెగాసెస్ కొనలేదని మాజీ ఇంటెలిజెన్స్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పెగాసెస్‌ను కొనలేదని డీజీపీ కార్యాలయమే చెప్పిందని గుర్తుచేశారు. ఉద్దేశపూర్వకంగా తనపై వ్యక్తిత్వ ఆరోపణలకు పాల్పడ్డారని అన్నారు. పెగాసెస్‌పై ప్రజల భయాన్ని పోగొట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. 2019 మే వరకు ప్రభుత్వం కానీ డీజీపీ, సీఐడీ, ఏసీబీ లాంటి ఏ ప్రభుత్వ విభాగమూ పెగాసెస్‌ను కొనలేదు, వాడలేదు అని అన్నారు.
ఎక్కడా ఫోన్లు ట్యాప్ కాలేదని నొక్కి చెప్పారు. 2019 మే తర్వాత ఏం జరిగిందనే దానికి తన దగ్గర సమాచారం లేదన్నారు. 2021 ఆగస్టు వరకు ఈ పెగాసస్ సాఫ్ట్‌వేర్‌ను కొనలేదని డీజీపీ కార్యాలయం వెల్లడించిందని గుర్తుచేశారు. పెగాసస్‌తో ముడిపెట్టి తనపై పూర్తిగా అబద్ధపు ప్రచారం చేస్తున్నారని అన్నారు. సంబంధితులపై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు.