- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్.. హేట్ స్పీచ్‌ను అనుమతిస్తుందా? సెక్షన్ 295(A)రోల్ ఏంటి?
దిశ, ఫీచర్స్ : నేటి సమాజం సోషల్ మీడియాకి కనెక్ట్ అయిపోయింది. చిన్న ఇన్సిడెంట్ కూడా క్షణాల్లో వైరల్ అవుతోంది. రాజకీయ నాయకులు, సెలబ్రెటీలు హైలెట్ అయ్యేందుకు.. కులమతాలను రెచ్చగొట్టేందుకు వేదిగా మారుతోంది. హాస్యనటుడు మునావర్ ఫరూఖీ నుంచి నుపుర్ శర్మ వరకు చాలా మంది మతపరమైన మనోభావాలను దెబ్బతీసినందుకు ఫేమ్ పొందారు. కానీ ఇలాంటి రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తే శిక్షించే చట్టాలు లేవా? అంటే ఉన్నాయనే చెప్పాలి.
ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్:
ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది భారత రాజ్యంగంలోని ఆర్టికల్ 19(1)లో ప్రతీ భారతీయ పౌరుడు వారి అభిప్రాయాలను వ్యక్తపరిచేందుకు, రాసేందుకు ఈ చట్టం స్వేచ్ఛనిస్తుంది. అయితే ఈ చట్టం ద్వేష పూరిత (హేట్ స్పీచ్ ) ప్రసంగాన్ని అనుమతిస్తుందా? అనే అనుమానం కొందరికి రావచ్చు.
హేట్ స్పీచ్ (ద్వేష పూరిత ప్రసంగం) అంటే?
లా కమిషన్ ఆఫ్ ఇండియా ప్రకారం, ఇప్పటి వరకు భారత చట్టంలో హేట్ స్పీచ్ అనేది నిర్వచించబడలేదు. కానీ, కొన్ని చట్టపరమైన నిబంధనలు ప్రసంగంలో మాట్లాడే తీరును నిషేధించాయి. బాధ్యత లేని పదాల వాడకం, మనోభావాలను దెబ్బతీసే ప్రసంగం.. హేట్ స్పీచ్‌గా పరిగణించబడుతుంది. అంతేకాకుండా ఐపిసి సెక్షన్ల కింద శిక్షకు అర్హులు.
ఆర్టికల్ 19(2) రిస్ట్రిక్స్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్
ఇండియా ప్రజాస్వామ్య దేశం. ఇక్కడ అనేక మతాలు, కులాలు ఉంటాయి. ఆర్టికల్ 19(2) ప్రకారం ఎవరి మనోభావాలు దెబ్బతీయకూడదు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్‌ను ఎవరూ మిస్‌యూజ్ చేయకూడదు. అంతేకాకుండా భారతదేశ సార్వభౌమాధికారం, సమగ్రత, స్టేట్ సెక్యూరిటీ, విదేశీ రాష్టాలతో ఫ్రెండ్లీ రిలేషన్స్, పబ్లిక్ ఆర్డర్స్, డిఫమేషన్ లేదా నేరానికి ప్రేరేపించడం వంటి కొన్ని రిస్ట్రిక్షన్లకు లోబడి ఉండాలి. కాగా ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది హేట్ స్పీచ్‌ను అనుమతించదని ఈ ఆర్టికల్ స్పష్టంగా తెలియజేస్తుంది.
సెక్షన్ 295(A)రోల్ ఎలా ఉంటుంది?
భారతీయ పౌరుల్లోని ఏ క్లాస్‌కు సంబంధించిన వారైనా.. ఉద్దేశపూర్వకంగా కానీ, మరే ఇతర కారణాల వల్ల గానీ మతపరమైన మనోభావాలను ఇన్సల్ట్ చేసేందుకు ప్రయత్నిస్తే.. ఇండియన్ పీనల్ కోడ్ 1860 లోని సెక్షన్ 295 A ప్రకారం శిక్షించబడతారు. అంతేకాకుండా ఇండియన్ కాన్స్‌టిట్యూషన్‌లో హేట్ స్పీచ్ ఏ మాత్రం యాక్సెప్టబుల్ కాదని ఈ సెక్షన్ తెలియజేస్తుంది.