Headache: టైంకు తినకపోతే తలనొప్పి వస్తుందా..?

by Anjali |
Headache: టైంకు తినకపోతే తలనొప్పి వస్తుందా..?
X

దిశ, వెబ్‌డెస్క్: జీవన శైలిలో మార్పుల కారణంగా చాలా మంది సమయానికి భోజనం చేయడం లేదు. ఉద్యోగం అంటూ ఉరుకులు పరుగులు తీస్తూ.. నాణ్యమైన ఫుడ్ కూడా తీసుకోవడం లేదు. బయట దొరికే ఆహారం తింటూ లేనిపోనీ సమస్యలు కొని తెచ్చుకుంటూ ఆసుపత్రుల చూట్టూ తిరుగుతున్నారు. బరువు పెరగడానికి(Weight gain) కూడా సమయానికి తినకపోవడమేనని నిపుణులు తరచూ చెబుతూనే ఉంటారు. చాలా మంది ఈ కారణంగా బరువు తగ్గాలని టిఫిన్(Tiffin) తినడమో లేక, మధ్యాహ్నం భోజనం(Afternoon meal) చేయకుండా లేదా నైట్ ఖాళీ కడుపుతో అలాగే పడుకుంటారు.

అయితే కొంతమందికి టైంకు తినకపోతే తీవ్రమైన తలనొప్పి(Severe headache) వేధిస్తుంటుంది. దీనికి కారణమేంటో తాజాగా నిపుణులు వెల్లడించారు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. టైంకు తినకపోతే బాడీలోని గ్లూకోజ్ లెవల్స్ తగ్గుతాయి. దీంతో మెదడు(brain) సరిగ్గా పనిచేయక.. కాన్సన్ ట్రేషన్(Consontration) తగ్గిపోతుంది. మెమోరీ లాస్(Memory loss) అవుతుంది. కొద్ది నిమిషాల్లోనే మూడ్ ఛేంజ్(Mood change) అవ్వడం లాంటి ప్రాబ్లమ్స్ తలెత్తుతాయి.

గ్లూకోజ్ స్థాయిలు(Glucose levels) తగ్గి.. తద్వారా స్ట్రెస్ హార్మోన్లైన(Stress hormones) కార్టిసాల్ రిలీజ్(Cortisol release) అవుతుంది. దీంతో యాంగ్జయిటీ, చిరాకు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. అయితే పోషకాహార నిపుణులు(Nutritionists) ఏం చెబుతున్నారంటే..? ఖాళీ కడుపుతో ఆరు గంటలు మాత్రమే ఉండాలని.. అంతకన్నా ఎక్కువ సేపు ఉంటే కొత్త సమస్యలు తెచ్చుకున్నవాళ్లు అవుతారని చెబుతున్నారు. అలాగే మీరు తినే ఆహారంలో పోషకాలు కూడా ఉండేలా చూసుకోవడం ముఖ్యమని సూచిస్తున్నారు.

గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సంప్రదించగలరు.



Next Story