SUMMER: పుచ్చకాయ తిన్న తర్వాత ఇవి తింటున్నారా.. డేంజర్‌లో పడ్డట్లే..?

by Anjali |
SUMMER: పుచ్చకాయ తిన్న తర్వాత ఇవి తింటున్నారా.. డేంజర్‌లో పడ్డట్లే..?
X

దిశ, వెబ్‌డెస్క్: సమ్మర్‌లో పుచ్చకాయ (watermelon) అతిగా తింటారు. పుచ్చకాయ ఆరోగ్య ప్రయోజనాలు కూడా బోలెడు. పుచ్చకాయలోని పోషకాలు, నీరు, విటమిన్లు (Vitamins), మెగ్నీషియం వంటివి ఆరోగ్యానికి చాలా మంచివి. పుచ్చకాయ తినడం వల్ల చర్మం మృదువు(Skin softening)గా ఉంటుంది. చర్మం పగుళ్లు తగ్గుతాయి. చర్మ స్థితిస్థాపకత పెరుగుతుంది. రక్త ప్రసరణ (blood circulation)మెరుగుపడుతుంది. చర్మ కణాలు మరమ్మతు అవ్వడం, రక్తపోటు తగ్గుతుంది, జీర్ణక్రియ సులభంగా జరుగడం,

మలబద్ధకం(Constipation) తగ్గుతుంది. వీటితో పాటుగా గుండె ఆరోగ్యం (heart health) మెరుగుపడుతుంది. హృదయ స్పందన స్థిరంగా ఉంటుంది. వాటర్ మిలన్‌లో విటమిన్ A, విటమిన్ B6, విటమిన్ C, మెగ్నీషియం(Magnesium), భాస్వరం, సిట్రులిన్ (Citrulline) పుష్కలంగా ఉంటాయి. వాటర్ మిలన్ గింజలలో విటమిన్ బి ఉంటుంది. ఇది నరాల వ్యవస్థ, మెదడు ఆరోగ్యానికి మంచిది.

పుచ్చకాయలో సోడియం (Sodium) తక్కువగా ఉంటుంది. పుచ్చకాయ తింటే బాడీ హైడ్రేట్‌గా ఉంటుంది. ఎందుకంటే దీనిలో వాటర్ శాతం ఎక్కువ. కంటిచూపు మెరుగుపడుతుంది. చర్మం సౌందర్యం కూడా పెరగడమే కాకుండా.. రోగనిరోధక శక్తి (Immunity) పెరుగుతుందని నిపుణులు సూచిస్తుంటారు. అయితే పుచ్చకాయ తిన్న తర్వాత పాలు తాగకూడదని నిపుణులు చెబుతున్నారు.

తాగితే జీర్ణ సమస్యలు వస్తాయని, చెబుతున్నారు. అలాగే ప్రోటీన్స్ (proteins) అధికంగా ఉన్న ఆహారాలు తినకూడదు. జీర్ణ ఎంజైమ్‌లను దెబ్బతీస్తుంది. అంటే పప్పులు (Pappulu), ఎగ్స్, పన్నీర్ (Paneer), మలబద్ధకం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన సం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సంప్రదించగలరు.

Next Story

Most Viewed