ఇంటర్మీడియట్ విద్యలో సంస్కృతం వద్దు

by samatah |   ( Updated:2022-04-05 13:07:31.0  )
ఇంటర్మీడియట్ విద్యలో సంస్కృతం వద్దు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ద్వితీయ భాషగా సంస్కృతంను ప్రవేశ పెట్టాలనే ఆలోచనను ఇంటర్ బోర్డు విరమించుకోవాలని తెలుగు బాషాను రెండవ సబ్జెక్టుగా కొనసాగించాలని భారత విద్యార్థి ఫెడరేషన్(ఎస్ఎఫ్ఐ) రాష్ట్ర కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర అధ్యక్ష్యా, కార్యదర్శులు ఆర్ఎల్ మూర్తి, టి నాగరాజు‌లు ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఇంటర్మీడియట్ కళాశాలల్లో ఎక్కువ మంది పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులు చదువుకుంటున్నారని, వారికి పాఠశాల స్థాయిలో సంస్కృతం సబెక్టుగా లేదని ఇప్పుడు ఇంటర్‌లో ప్రవేశ పెట్టడం కోసం సంస్కృతం అధ్యాపక పోస్టులు భర్తీ చేసి ఈ సబ్జెక్ట్ ప్రవేశపెట్టడం అంటే మాతృభాషను అవమానించడమే నన్నారు. దక్షిణాదిలో రాష్ట్ర ప్రభుత్వాలు తమ మాతృభాషను కాపాడుకోవడం కోసం సిలబస్ మొత్తమే మాతృభాష ఉపయోగిస్తుంటే తెలంగాణ మాత్రం దీనికి భిన్నంగా ఉందన్నారు. ఈ కోర్సు చదవడం మూలంగా ఎలాంటి ఉపాధిని విద్యార్థులు పొందలేరని, ఇంటర్మీడియట్ తర్వాత చదవడానికి ఉన్నత విద్యకు సంస్కృతం ఉపయోగపడదని కేవలం ర్యాంకులు, మార్కులు కోసం తీసుకుని వస్తున్న సంస్కృతం విద్యార్థుల్లో శాస్త్రీయ విద్య స్థానంలో మూఢవిశ్వాసాలు పెంపొందిస్తుందన్నారు. తక్షణమే ఇంటర్మీడియట్ బోర్డు ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed