కేసీఆర్ మహిళలను కేవలం వాటి కోసమే ఉపయోగించుకుంటున్నారు: డీకే అరుణ

by Satheesh |
కేసీఆర్ మహిళలను కేవలం వాటి కోసమే ఉపయోగించుకుంటున్నారు: డీకే అరుణ
X

దిశ, శంషాబాద్: మహిళలు కేసీఆర్ మాయలో పడకుండా ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు డీకే అరుణ పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మైలార్దేవుపల్లి కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో కేఎల్ఎమ్ గార్డెన్‌లో జరిగిన మహిళా దినోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై మహిళా మోర్చా నాయకులను సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళలు ఏ రంగంలో కూడా తక్కువ కాకుండా అన్ని రంగాలలో కూడా పురుషులతో సమానంగా ముందు వరుసలో ఉన్నారని అన్నారు. సమాజంలో మహిళల పట్ల ప్రతి ఒక్కరూ గౌరవప్రదంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌కు మహిళల పట్ల గౌరవం లేదని.. కేవలం ఓట్ల కోసమే మహిళలను వాడుకోవడానికి మహిళా బంధువని కొత్త పథకాన్ని తీసుకు వస్తున్నారని ఆరోపించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుగుతుంటే రాష్ట్ర ప్రథమ పౌరురాలు మహిళ గవర్నర్ అవమానించిన తీరును చూస్తుంటే సీఎంకు మహిళలంటే గౌరవం లేదని అన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరిపై లక్ష రూపాయల అప్పు భారం పడుతుందన్నారు. ఓట్ల కోసం రాజకీయం చేసే టీఆర్ఎస్ పార్టీని, ముఖ్యమంత్రిని నియంత పాలన అంతం చేయడంలో మహిళా లోకం అంతా ఏకమైతే టీఆర్ఎస్ పార్టీని ఓడించడం ఎంతో సులభం అన్నారు.

Advertisement

Next Story