Music Director: హీరో కంటే ముందు అతని డేట్స్ కోసం ఎగబడుతున్న దర్శకనిర్మాతలు.. ఎవరంటే?

by Prasanna |
Music Director: హీరో కంటే ముందు అతని డేట్స్ కోసం ఎగబడుతున్న దర్శకనిర్మాతలు.. ఎవరంటే?
X

దిశ, వెబ్ డెస్క్: ఒకప్పుడు తెలుగు సినిమా వస్తుందంటే చాలు పాటలు ఎంజాయ్ చేయడానికి ప్రేక్షకులు రెడీగా ఉంటారు. ఇక దర్శకనిర్మాతలు కూడా మంచి మ్యూజిక్ డైరెక్టర్ కోసం వెతుకులాటలో ఉంటున్నారు. ఇప్పుడు, తాజాగా అందరూ ఆ మ్యూజిక్ డైరెక్టర్ డేట్స్ ఎప్పుడు ఇస్తాడా.. అని వెయిట్ చేస్తున్నారు. మరి ఇంతకీ అతనెవరో ఇక్కడ తెలుసుకుందాం..

టాలీవుడ్, కోలీవుడ్ అని లేకుండా అన్ని సినిమాలకు మ్యూజిక్ ఇస్తూ ఎక్కువ పాపులర్ అయిన సంగీత దర్శకుల్లో అనిరుధ్ (Anirudh Ravichander) కూడా ఒకరు. దేవర (Devara) మూవీ సూపర్ హిట్ అవ్వడంతో అనిరుధ్ సినీ కెరీర్ మొత్తం ఛేంజ్ అయింది. వరుస ఆఫర్లతో పాటు ఇతని డేట్స్ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. అనిరుధ్ రెమ్యునరేషన్ హై రేంజ్ లో ఉన్నా కూడా ఎంత అడిగిన కూడా నిర్మాతలు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు.

దేవర సినిమా హిట్ అయిందంటే కారణం అనిరుధ్ ఇచ్చిన మ్యూజిక్, బీజీఎమ్ వలనే! అతను ఇచ్చిన సాంగ్స్ తో సినిమాను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్ళాడు. ముందు ముందు అనిరుధ్ కెరీర్ పరంగా ఎదిగి ఇంకా మరిన్ని సినిమాలు చేయాలని తన సక్సెస్ రేట్ ను పెంచుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed