- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
RGV సంచలన నిర్ణయం.. సంబురాల్లో టీఆర్ఎస్ శ్రేణులు
దిశ, వెబ్‌డెస్క్: సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బయోపిక్ తీయాలని నిర్ణయించుకున్నాడు. అది కూడా 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందే చిత్రాన్ని విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు ప్రకటించారు. 'డేంజరస్' చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని రామ్ గోపాల్ వర్మ వెల్లడించారు. అంతేగాక, నిజ జీవితం ఆధారంగా తీసే చిత్రం కావడంతో స్క్రిప్ట్ రెడీ చేసుకోవడం పెద్ద విషయమేమీ కాదని అభిప్రాయపడ్డారు. ఇప్పటికే పలు బయోపిక్ చిత్రాలకు దర్శకత్వం వహించి మెప్పించారు కూడా. తాజాగా.. మాజీ మంత్రి కొండా మురళి సురేఖ దంపతుల జీవిత చరిత్ర ఆధారంగా 'కొండా' చిత్రాన్ని ఆర్జీవీ తెరకెక్కించారు. ఈ బయోపిక్‌కు స్వయంగా కొండా దంపతులే నిర్మాతలుగా వ్యవహరించారు. అంతేగాక, ఈ చిత్రంలో ఎక్కువ భాగం షూటింగ్ కొండ మురళి దంపతుల స్వగ్రామమైన హన్మకొండలోనే చిత్రించారు. మరి ముఖ్యమంత్రి కేసీఆర్ బయోపిక్ ఎలాంటి కాంట్రవర్సీలు క్రియేట్ చేస్తుండో చూడాలి.