- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Prashant Verma: ప్రతి కథపై హీరో పేరు రాసి ఉంటుంది.. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
దిశ, సినిమా: స్టార్ హీరో మహేశ్ బాబు (Mahesh Babu) మేనల్లుడు అశోక్ గల్లా (Ashok Galla) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘దేవకీ నందన వాసుదేవ’ (Devaki Nandana Vasudeva). ఈ సినిమాలో అశోక్ గల్లా సరసన మాజీ మిస్ ఇండియా (2020) మానస వారణాసి హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాకు ‘హనుమాన్’ ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ (Prashanth Verma) కథ అందిస్తుండగా.. అర్జున్ జంధ్యాల (Arjun Jandhyala) దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ నవంబర్ (November) 22న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇక రిలీజ్ సమయం దగ్గర పడటంతో తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథులుగా నటుడు రానా (Rana), హీరో సందీప్ కిషన్ (Sandeep Kishan), డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, రైటర్ సాయిమాధవ్ బుర్ర (Saimadhav Burra) హాజరయ్యారు. ఈ సందర్భంగా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశారు.
‘ప్రతి కథ పైనా హీరో పేరు రాసి ఉంటుందని నేను నమ్ముతాను. ఈ కథను నేను 7 ఏళ్ల క్రితం రాసుకున్నా. ఈ సినిమాను అశోక్ గల్లా చేసినందుకు చాలా ఆనందంగా ఉన్నాను. నేను అనుకున్న కథను అర్జున్ చాలా బాగా చూపించారు. ఈ చిత్రం కోసం టీమ్ అంతా చాలా కష్టపడింది. ఈ మూవీ ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుంది’ అని చెప్పుకొస్తూ.. ‘నా తర్వా సినిమా అప్‌డేట్ రెండు వారాల్లో ఇస్తాను’ మూవీ అప్‌డేట్ కూడా ఇచ్చాడు ప్రశాంత్ వర్మ.