Dil Raju: 50 ఏళ్ల వయస్సులో మరోసారి తండ్రి అయిన దిల్‌రాజ్..

by Manoj |   ( Updated:2022-06-29 06:39:50.0  )
Dil Raju And Tejaswini Reddy Blessed With baby boy
X

దిశ, వెబ్‌డెస్క్: Dil Raju And Tejaswini Reddy Blessed With baby boy| టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజ్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. డిస్ట్రిబ్యూటర్‌గా కెరీర్ మొదలుపెట్టి ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించి, టాలీవుడ్ లోనే అగ్ర నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్‌గా కూడా తనకంటూ ప్రత్యేక పేరు సంపాదించుకున్నాడు. అయితే కొన్నేళ్ల క్రితం దిల్ రాజ్ భార్య మరణించిన విషయం తెలిసిందే.

ఆ తర్వాత దిల్ రాజు కూతురు ఒత్తిడితో కరోనా సమయంలో ఆయన దూరపు బంధువు అయిన తేజస్విని రెండో పెళ్లి చేసుకున్నాడు. ఇటీవల తేజస్వి ప్రెగ్నెంట్ అనే వార్తలు వచ్చినప్పటికీ దీనిపై దిల్‌రాజ్ మాత్రం ఏ క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా, దిల్‌రాజ్ మరోసారి తండ్రి అయినట్టు సమాచారం. దిల్‌రాజ్ భార్య తేజస్విని జూన్ 29న ఉదయం మగ బిడ్డకు జన్మనిచ్చినట్టు తెలుస్తోంది. దీంతో టాలీవుడ్‌లోని ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.



Next Story

Most Viewed