ఆలయంలో పనిచేయని ఏసీలు.. సతమతమవుతున్న భక్తులు

by Javid Pasha |
ఆలయంలో పనిచేయని ఏసీలు.. సతమతమవుతున్న భక్తులు
X

దిశ, వేములవాడ: మొక్కులు చెల్లించుకునేందుకు బద్దిపోచమ్మ అమ్మవారికి దగ్గరకు వెళ్లే భక్తులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఆలయంలో ఏసీలు పనిచేయపోవడంతో ఎండాకాలంలో భక్తుల ఇబ్బందులు తీవ్రతరం అయ్యాయి. అయితే వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులు దర్శనానంతరం బద్దిపోచమ్మ అమ్మవారికి మొక్కలు చెల్లించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. అమ్మవారికి బోనం సమర్పించే భక్తులు క్యూ లైన్లలో గంటల తరబడి వేచి ఉండవలసి వస్తుంది. భక్తుల సౌకర్యార్థం గతంలో ఆలయ అధికారులు సెంట్రల్ ఏసీ బిగించారు.

కానీ ఏడాది నుంచి ఆ ఏసీలు పనిచేయడం లేదు. అయినా అధికారులు వాటిని బాగుచేయించడం మరిచారు. ఎండల తీవ్రత ఎక్కువ ఉండడంతో బద్ది పోచమ్మ ఆలయం క్యూ లైన్లలో నిలుచున్న భక్తులు, చిన్న పిల్లలు ఉక్కపోతకు ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు. ఇప్పుడైనా అధికారులు స్పందించి ఏసీలు బాగు చేయించాలని భక్తులు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed