నేను 'పుష్ప2' ఫస్ట్ హాఫ్ చూశాను.. . ఐకాన్ స్టార్ అదరగొట్టేశాడు : Devi Sri Prasad

by Phanindra |   ( Updated:2024-10-15 14:27:48.0  )
నేను పుష్ప2 ఫస్ట్ హాఫ్ చూశాను.. . ఐకాన్ స్టార్ అదరగొట్టేశాడు : Devi Sri Prasad
X

దిశ, వెబ్ డెస్క్ : ఈ హీరో పేరు చెప్పగానే అందరికీ ముందు గుర్తొచ్చే డైలాగ్ తగ్గేదెలే. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న 'పుష్ప2'( Pushpa 2) సినిమా కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ప్రమోషనల్ వీడియో మూవీ పై అంచనాలును పెంచేసింది. అయితే, తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ (Devi Sri Prasad) 'పుష్ప 2' గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు.

అక్టోబర్ 19న దేవిశ్రీ ప్రసాద్‌ హైద్రాబాద్ లో మ్యూజిక్‌ కాన్సర్ట్‌ ను నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ 'పుష్ప 2' ఎలా ఉంటుందో రెండు మాటల్లో చెప్పాడు." నేను పుష్ప 2 ఫస్ట్ హాఫ్ చూశాను. చాలా బాగా తీసాడు సుకుమార్. దీనిలోని ప్రతీ సీన్ దిమ్మ తిరిగిపోయింది. మీకు తెలియకుండానే పుష్ప వరల్డ్‌ లోకి వెళ్తారు.. అక్కడి నుంచి ప్రతి సీన్ ఇంటర్వెల్‌లా ఉంటుంది. ఆడియెన్స్ కు సినిమా మొత్తం నచ్చేస్తుంది. దర్శకుడు సుకుమార్‌ కథ చెప్పినప్పుడే నాకు బాగా నచ్చింది. ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) అయితే విరగదీసాడు .." అంటూ సినిమాపై భారీ హైప్ ను క్రియోట్ చేశాడు.



Next Story

Most Viewed