నియోజకవర్గ ప్రజా ప్రతినిధులకు టెలీ కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి కీలక ఆదేశాలు

by Manoj |
నియోజకవర్గ ప్రజా ప్రతినిధులకు టెలీ కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి కీలక ఆదేశాలు
X

దిశ, వనపర్తి : సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నియోజకవర్గంలోని అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. బుధవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి పార్టీ కార్యకర్తలు,నేతలు, ప్రజా ప్రతినిధులతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మంగళవారం సీఎం కేసీఆర్ సభకు భారీగా తరలివచ్చి విజయవంతం చేసిన నాగర్ కర్నూలు, గద్వాల, దేవరకద్ర, అలంపూర్, కొల్లాపూర్, వనపర్తి ప్రజలకు, నేతలకు, కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అన్ని స్థాయిల ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.

ప్రజల నమ్మకాలను నిజం చేసేందుకు ఎంతో బాధ్యతతో పని చేయాలని సూచించారు. ఎండాకాలంలో గ్రామాల్లో ప్రతి చెరువు, కుంటల్లో ఉన్న ఒండ్రుమట్టిని రైతులు పొలాలకు తరలించడంతో భూసారం పెరగడంతో పాటు ఎరువుల వినియోగం తగ్గుతుందన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజా ప్రతినిధులు ఉండి మట్టిని తరలించేందుకు రైతులలో ఉత్సాహం తీసుకురావాలని, గ్రామంలో కాలువలు, కుంటలు, చెరువులను పటిష్టం చేయాలని,16 గ్రామాల లింకింగ్ రహదారులు త్వరగా పూర్తయ్యేలా పనులు వేగం పెంచాలని అన్నారు. రానున్న రెండు నెలల్లో రహదారి పనులు పూర్తి కావాలని మంత్రి అన్నారు. మెట్ పల్లి రైతులకు నీరందించేందుకు త్వరలో సర్వే నిర్వహిస్తామన్నారు. త్వరలో అతి పెద్ద రైతు సమ్మేళనం వనపర్తిలో నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. కమ్యూనిటీ భవనాలు, ఇతర అభివృద్ధి పనులను త్వరలో ప్రారంభించుకుందామని అన్నారు.

Advertisement

Next Story