- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Devara OTT Release: ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘దేవర’.. స్ట్రీమింగ్ ఆ రోజు నుంచే?
దిశ, సినిమా: యంగ్ టైగర్ ఎన్టీఆర్(Young Tiger NTR), కొరటాల శివ కాంబోలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘దేవర’(Devara) సెప్టెంబర్ 27న విడుదలైంది. అయితే ఈ సినిమా మొదట మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ ఆ తర్వాత పాజిటివ్ టాక్‌తో థియేటర్స్‌లో పికప్ అయింది. ప్రేక్షకులను మెప్పించడంతో పాటు కలెక్షన్స్ పరంగా భారీగా రాబడుతూ థియేటర్స్‌లో దూసుకుపోతుంది. అయితే ఈ మూవీ విడుదల సమయానికి అరడజన్ ఉన్నప్పటికీ బాక్సాఫీసు వద్ద దేవర(Devara) హవా కనిపిస్తోంది. 16 రోజుల్లోనే ‘దేవర’ (Devara)రూ. 500 కోట్ల కలెక్షన్లు సాధించడంతో పాటు ప్రభాస్(Prabhas) బాహుబలి-2ను దాటినట్లు ఇటీవల మేకర్స్ అధికారిక ప్రకటనను కూడా విడుదల చేసిన సంగతి తెలిసిందే.
దీంతో ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. దేవర (Devara)ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా చూద్దామా అని తారక్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. తాజాగా, దేవర(Devara) మూవీ డిజిటల్ స్ట్రీమింగ్‌కు రెడీ అయినట్లు సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. అయితే దీని స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ సంస్థ నెట్‌ఫ్లిక్స్(Netflix) దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఆరు వారాల తర్వాత ఓటీటీలోకి వచ్చేలా ముందే మేకర్స్ ఒప్పందం చేసుకున్నట్లు టాక్. ఈ లెక్కన నవంబర్ 8 నుంచి స్ట్రీమింగ్ అందుబాటులోకి రాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ఈ విషయం తెలిసిన సినీ ప్రియుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.