Devaki Nandana Vasudeva: రేసు నుంచి తప్పుకున్న మహేశ్ బాబు మేనల్లుడు.. ఆ ఇద్దరు స్టార్ హీరోలే కారణం!

by sudharani |
Devaki Nandana Vasudeva: రేసు నుంచి తప్పుకున్న మహేశ్ బాబు మేనల్లుడు..  ఆ ఇద్దరు స్టార్ హీరోలే కారణం!
X

దిశ, సినిమా: స్టార్ హీరో మహేశ్ బాబు (Mahesh Babu) మేనల్లుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త జయదేవ్ గల్లా (Jayadev Galla) కొడుకు అశోక్ గల్లా (Ashok Galla) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘దేవకీ నందన వాసుదేవ’ (Devaki Nandana Vasudeva). ఈ సినిమాలో అశోక్ గల్లా సరసన మాజీ మిస్ ఇండియా (2020) మానస వారణాసి హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాకు ‘హనుమాన్’ ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ (Prashanth Verma) కథ అందిస్తుండగా.. అర్జున్ జంధ్యాల (Arjun Jandhyala) దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ నవంబర్ 14 విడుదల కాబోతున్నట్లు గతంలో చిత్ర బృందం అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.

ఇప్పుడు ఈ రిలీజ్ డేట్‌ను పోస్ట్ పోన్ చేస్తూ.. కొత్త రిలీజ్ డేట్ (Release Date) ప్రకటించారు. ఈ మేరకు నవంబర్ (November) 22న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. కాగా.. నవంబర్ 14న మెగా హీరో వ‌రుణ్ తేజ్ (Varun Tej) ‘మ‌ట్కా’, కోలీవుడ్ స్టార్ సూర్య (surya) ‘కంగువ’ సినిమాలు రిలీజ్‌కు సిద్ధంగా ఉండటంతో.. రెండు పెద్ద సినిమాల మ‌ధ్య ఈ సినిమా విడుద‌ల కానుడటంతో మూవీపై ఎఫెక్ట్ ప‌డే అవ‌కాశం ఉంద‌ని భావించిన మేక‌ర్స్ ‘దేవకీ నందన వాసుదేవ’ చిత్రాన్ని పోస్ట్ పోన్ చేసి కొత్త రిలీజ్ డేట్‌ను ప్రకటించారు.

Next Story