- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
విరాట్ స్థానంలో RCB కెప్టెన్ ను ప్రకటించేది ఆ రోజే

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2022 సీజన్ కు అన్నీ జట్లు తమ తమ కెప్టెన్‌లను ప్రకటించాయి. కానీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తరుణంలో ప్రస్తుతం RCB టీమ్ ను నడిపించే సారధి పై వివిధ ఊహాగానాలు వస్తున్నాయి. సౌత్ ఆఫ్రికా విద్వంసకర ప్లేయర్ ఫాఫ్ డుప్లెసిస్ ను RCB జట్టు సారధి గా నియమిస్తారని చర్చ నడుస్తోంది. అయితే 2022 సీజన్ కు గాను RCB తన మొదటి మ్యాచ్ ని మార్చి 21న పంజాబ్ కింగ్స్ తో తలపడనుంది.
ఈ తరుణంలో RCB కొత్త కెప్టెన్ ని ఎప్పుడు ప్రకటిస్తారనే సందేహం ప్రతి అభిమాని మదిలో నెలకొంది. అయితే అభిమానుల సందేహాన్ని తీర్చడానికి RCB టీమ్ కొత్త కెప్టెన్ మార్చి 12న సాయంత్రం 4 గంటలకు విలేకరుల సమావేశానికి పిలుపునిచ్చింది. ఆ రోజే టీమ్ కొత్త కెప్టెన్ ను అధికారికంగా ప్రకటిస్తారు. అలాగే RCB తమ కొత్త జెర్సీని కూడా యాజమాన్యం లాంచ్ చేయనుంది. దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ గత సీజన్‌లో CSK ఓపెనర్‌గా, ప్రపంచ కప్‌తో సహా మూడు ఫార్మాట్లలో జట్టును నడిపించిన కెప్టెన్‌గా అపారమైన అనుభవం ఉంది.