ఆ భారం ప్రభుత్వమే భరించాలి: తమ్మినేని వీరభద్రం

by GSrikanth |
ఆ భారం ప్రభుత్వమే భరించాలి: తమ్మినేని వీరభద్రం
X

దిశ, తెలంగాణ బ్యూరో: పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. గృహ వినియోగదారులకు యూనిట్‌‌కు 50 పైసలు, పరిశ్రమలకు యూనిట్‌కు రూపాయి చొప్పున పెంచి విపరీతమైన భారాన్ని వేయడం సరికాదన్నారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. డిస్కంల పెంపు ప్రతిపాదనను ఉన్నదున్నట్టు రెగ్యులేటరీ కమిషన్‌ ప్రకటించడమంటే సమగ్రంగా పరిశీలించలేదని అర్థమవుతున్నదన్నారు. టారీఫ్‌ రేట్ల బహిరంగ విచారణలో పాల్గొన్న అనేక మంది ఛార్జీలు పెంచవద్దని, భారాలను ప్రభుత్వమే సబ్సిడీగా భరించాలని శాస్త్రీయంగా వివరించారన్నారు. రాష్ట్ర అవసరాల మేరకు మాత్రమే విద్యుత్‌‌ను కొనుగోలు చేసి, వృథా ఖర్చును తగ్గించడం ద్వారా భారాలు పెంచకుండా విద్యుత్‌ను సరఫరా చేయవచ్చన్నారు. పెంచిన విద్యుత్‌ ఛార్జీలకు వ్యతిరేకంగా ఎక్కడికక్కడ నిరసనలు తెలపాలని సీపీఐ(ఎం) పిలుపునిస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed