- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
యాదాద్రిలో ఘనంగా మహాకుంభాభిషేకం.. ఏర్పాట్లు పరిశీలించిన మహేశ్ భగవత్
దిశ, యాదగిరిగుట్ట: ఆలయ పునఃప్రారంభం దృష్ట్యా భద్రతను రాచకొండ సీపీ మహేష్ భగవత్ పోలీసు సిబ్బందితో కలిసి ఆదివారం పరిశీలించారు. పున:ప్రారంభం రోజున వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు రానున్న నేపథ్యంలో భద్రత దృష్ట్యా అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయంలో మహాకుంభాభిషేక మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ మహోత్సవంలో భాగంగా ప్రధాన ఆలయంలో ప్రత్యేక పూజలు, అష్టోత్తర శతకలశాభిషేకం నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు, యజ్ఞాచార్యులు, ఉప ప్రధానార్చకులు, అర్చకబృందం, పారాయణీకులు అత్యంత వైభవవంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, ఆలయ అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి, పర్యవేక్షకులు, ఉద్యోగ సిబ్బంది, భక్తులు పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. మహాకుంభ సంపృక్షణ ఉత్సవాల్లో భాగంగా ప్రతినిత్యం మంత్రాలతో దేవతలను ఆరాధించారు.
సాయంత్రం కార్యక్రమాలు
మహోత్సవాల్లో భాగంగా ఆదివారం సాయంత్రం స్వామివారి బాలాలయంలో నిత్యారాధనల అనంతరము సామూహిక శ్రీవిష్ణు సహస్రనామ పారాయణం, మూలమంత్ర, మూర్తి మంత్ర హవనములు నిర్వహించనన్నారు. స్వయంభూ ప్రధానాలయంలో ''షోడశ కళాన్యాస హోమములు, పంచశయ్యాధివానం'' తదుపరి బాలాలయంలో పూర్ణాహుతి నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలను ఆలయ ప్రధానార్చకులు, యజ్ఞాచార్యులు, ఉప ప్రధానార్చకులు, అర్చకబృందం నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాల్లో ఆలయ అధికారులు, ఉద్యోగసిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.