'కరోనా ఇంకా ముగిసిపోలే .. రూపాంతరం చెందుతుంది'

by samatah |
కరోనా ఇంకా ముగిసిపోలే .. రూపాంతరం చెందుతుంది
X

గాంధీ నగర్: కరోనా ఇంకా ముగిసిపోలేదని , ప్రజలు జాగ్రత్తలను పాటించాలి ప్రధాని కోరారు. కొవిడ్-19 రూపాంతారాలు ఎవ్వరికీ తెలియదని ఆయన అన్నారు. గుజరాత్ మా ఉమియా ధామ్ కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ లో ఆయన ప్రసంగించారు. రసాయన ఎరువుల బెడద నుంచి భూమాతను కాపాడే లక్ష్యంతో సహజ వ్యవసాయం వైపు మొగ్గు చూపాలని మా ఉమియా భక్తులను మోదీ కోరారు. వ్యాప్తిని నియంత్రించేందుకు దాదాపు 185 కోట్ల డోస్‌ల వ్యాక్సిన్‌లను అందించడం ప్రజల మద్దతు కారణంగా సాధ్యమైందని తెలిపారు. కరోనా అతిపెద్ద విపత్తు. మహమ్మారి ముగిసిందని మనం ఇప్పుడే చెప్పలేం. అది కాస్తా విరామం తీసుకుంది. అది ఎప్పుడూ తిరిగి వ్యాప్తి చెందుతుందో మనం చెప్పలేం. ఇది రూపాంతరం చెందే వ్యాధి. దీనిని అడ్డుకోవడానికి, దాదాపుగా 185 కోట్ల డోసులు అందించి, ప్రపంచాన్ని ఆశ్చర్యపోయేలా చేశాం. ఇదంతా మీ సహకారంతోనే జరిగింది' అని అన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 75వ సంవత్సరంలో నిర్వహిస్తున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ప్రతి జిల్లాలో 75 సరస్సులు రూపొందించడంలో పాల్గొనాలని ఆయన కోరారు.


Advertisement

Next Story