మానవత్వం చాటుకున్న ట్రాఫిక్ కానిస్టేబుల్.. Viral Video

by Satheesh |   ( Updated:2022-04-07 12:22:50.0  )
మానవత్వం చాటుకున్న ట్రాఫిక్ కానిస్టేబుల్.. Viral Video
X

దిశ, వెబ్‌డెస్క్: ఈ ఏడాది వేసవికాలం ప్రారంభంలోనే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఇక మధ్యాహ్నం పూటైతే జనాలు బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ఎండల ప్రభావం ఎక్కువగా ఉండటంతో వైద్యశాఖ వారు ప్రజలను అప్రమ్తతం చేస్తున్నారు. మధ్యాహ్నం సమయంలో చిన్న పిల్లలు, వృద్ధులు ఇంట్లోనే ఉండలంటూ హెచ్చరిస్తున్నారు. అవసరమైతేనే బయటకు రావాలని సూచిస్తున్నారు. మనుషులే తట్టుకోలేకపోతున్న ఈ ఎండలకు.. అడవుల్లో జీవించే జంతువుల పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు.

వేసవి కాలం కావడంతో అడవుల్లో నీరు దొరకకా.. చెట్లు ఎండిపోయి ఆహారం లేక.. అడవి జంతువులు జనవాసాల్లోకి వస్తున్నాయి. తాజాగా ఇలాంటే ఘటన ఒకటి సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది. బాగా దాహంతో ఉన్న కోతికి ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ నీళ్లు తాగించి.. దాహం తీర్చిన వీడియో వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మూగజీవాల పట్ల మానవత్వం చాటుకున్న పోలీసుపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వేసవి కాలంలో జనవాసాల్లోకి వచ్చిన అడవి జంతువులకు నీరు, ఆహారం అందించాలని కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed