Komatireddy Rajgopal Reddy: కాంగ్రెస్‌కు బిగ్‌ షాక్.. కోమటిరెడ్డి బీజేపీలో చేరికకు రంగం సిద్ధం?

by GSrikanth |   ( Updated:2022-07-22 08:18:29.0  )
Congress MLA Komatireddy Rajgopal Reddy is to join BJP
X

దిశ, వెబ్‌డెస్క్: Congress MLA Komatireddy Rajgopal Reddy is to join BJP| కాంగ్రెస్ కీలక నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరికకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. రెండ్రోజుల క్రితం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ ఎంపీ నిషికాంత్‌తో భేటీ అయ్యి చర్చలు జరిపినట్లు సమాచారం. అనంతరం చండూరు మండలంలో పార్టీ కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసుకున్న రాజగోపాల్ రెడ్డి, అనారోగ్యం కారణంగా సమావేశం రద్దు చేసుకున్నారు. పార్టీ మార్పుపైనే అనుచరులు, కార్యకర్తలో చర్చలు జరుపడం కోసం సమావేశం ఏర్పాటు చేశారని స్థానికంగా చర్చలు తీవ్రతరం అయ్యాయి. కాగా, గత కొంతకాలం క్రితం రాజగోపాల్ రెడ్డి బీజేపీ చేరుతానని ప్రకటించిన విషయం తెలిసిందే. అంతేగాక, తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపీనే అని, కాంగ్రెస్ పని అయిపోయిందని బహిరంగంగా వ్యాఖ్యలు చేసిన సంగతీ తెలిసిందే. చాలాకాలం సైలెంట్‌గా ఉన్న రాజగోపాల్ రెడ్డి.. తాజాగా.. పార్టీ మార్పు విషయమై కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేయడం కాంగ్రెస్‌లో కలకలం రేపుతోంది.

ఇది కూడా చదవండి: నాగార్జునసాగర్‌ డ్యామ్‌కు ఊహించని ముప్పు..?

Advertisement

Next Story