Constipation: పిల్లల్లో మలబద్ధకానికి కారణాలు.. పరిష్కారాలు..?

by Anjali |
Constipation: పిల్లల్లో మలబద్ధకానికి కారణాలు.. పరిష్కారాలు..?
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత రోజుల్లో చాలా మంది మలబద్ధకం (Constipation) సమస్యను ఎదుర్కొంటున్నారు. మలవిసర్జన (defecation) సమస్యనే మలబద్ధకం అని అంటారు. సాధారణంగా వారానికి మూడు కంటే తక్కువ సార్లు మలవిసర్జన చేయడం లేదా మలవిసర్జన చేయడంలో ఇబ్బందులు ఎదుర్కోవడాన్నే మలబద్ధకం అంటారు.

మలబద్ధకానికి కారణాలు చూసినట్లైతే.. ఆహారంలో ఫైబర్, పేద పోషకాహారం తినడం, నిద్ర సరిపోకపోవడం, ద్రవాలు తక్కువగా తీసుకోవడం, వ్యాయామం చేయకపోవడం, ఆందోళన (worry), భావోద్వేగ ఒత్తిడి(Emotional stress), వయస్సు (age) వంటివి మలబద్ధకం లక్షణాలు.

మలబద్ధకం వల్ల జరిగే సమస్యలు చూసినట్లైతే.. జీర్ణాశయ వ్యాధులు (Gastrointestinal diseases) తలెత్తుతాయి. హైపర్‌టెన్షన్ (Hypertension), ఫిషర్స్ (Fishers), పైల్స్ (Piles), తలనొప్పి (headache) వంటివి వస్తాయి. అయితే సాధారణంగా నిపుణులు మలబద్ధకాన్ని నివారించాలంటే ఈ విధంగా చేయాలని చెబుతుంటారు.

ఆహారంలో ఫైబర్ (Fiber), ద్రవాలు (liquids)ఎక్కువగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. ప్రతి రోజూ వ్యాయామాలు (Exercises) చేయాలని చెబుతుంటారు. రోజులో ఒకసారి పెరుగు తినాలని అంటారు.

వీటితో పాటుగా జీవన విధానంలో మార్పులు చేయాలి. కానీ మలబద్ధకం అంటే మీకు మలం విసర్జించడంలో ఇబ్బందిగా.. అంటే టాయిలెట్‌(toilet)కు వెళ్లేటప్పుడు ఒత్తిడికి గురికావడం లాంటివి జరుగుతుంది.

లేదా తరచుగా ప్రేగు కదలికలు.. అలాగే పిల్లలు మలబద్ధకంతో ఉన్నప్పుడు, వారికి మలం గట్టిగా, పొడిగా, కష్టంగా లేదా బాధాకరంగా ఉంటుందని నిపుణులు చెబుతుంటారు. మరీ పిల్లల్లో ఈ సమస్యకు చెక్ పెట్టాలంటే.. నిపుణులు చెప్పిన వివరాలు ఇప్పుడు చూద్దాం..

చిన్నారుల్లో మలబద్ధకం ప్రాబ్లమ్‌ను తరిమికొట్టాలంటే.. పిల్లలకు కూడా శారీరక అవసరమని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువగా వాకింగ్ (walking) చేయించాలి. అలాగే జంపింగ్ యాక్టివిటీలు (Jumping activities).. అలాగే రోజు మొత్తంలో ఆరు నుంచి ఎనిమిది లీటర్ల వాటర్ తాగాలి.

తాజా పండ్లు (Fresh fruits) తినాలి. ధాన్యాలు (Grains), కూరగాయలు (Vegetables) ఆహారంలో భాగం చేసుకోవాలి. బీట్ రూట్ (Beet root), ఆపిల్ (Apple), బొప్పాయి (papaya), క్యారెట్ (Carrot) తినాలి. పిల్లల పొట్ట చుట్టూ మసాజ్ చేయాలి. మలవిసర్జనకు ఓకే టైమ్ కు అలవాటు చేయాలని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన సం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సంప్రదించగలరు.

Next Story

Most Viewed