Rohit Shetty: ‘ఏదేమైనా లేడీ సింగమ్ వచ్చి తీరుతుంది’.. బాలీవుడ్ అగ్ర దర్శకుడు సెన్సేషనల్ కామెంట్స్

by Anjali |
Rohit Shetty: ‘ఏదేమైనా లేడీ సింగమ్ వచ్చి తీరుతుంది’.. బాలీవుడ్ అగ్ర దర్శకుడు సెన్సేషనల్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రోహిత్ శెట్టి(Rohit Shetty) క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. రోహిత్ కాప్ యూనివర్స్‌లో పోలీసు పాత్రలకు జనాల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఇటీవల ఈయన దర్శకత్వంలో తెరకెక్కిన సింగమ్ అగైన్(Singam Again) బాక్సాఫీసు వద్ద పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. భారీ వసూళ్లు కొల్లగొట్టిన ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె(Deepika Padukone) కీలక పాత్ర పోషించింది. డీసీపీ శక్తి శెట్టిగా అతిథి రోల్‌లో నటించి.. ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. అయితే ఈ బాలీవుడ్ లేడీ సింగమ్‌తో పూర్తి స్థాయి నాయికా ప్రాధాన్య సినిమా తీయాలని బాలీవుడ్ డైరెక్టర్ రోహిత్ ఆలోచన అట.

ఓ ఇంటర్వ్యూకు హాజరైన బాలీవుడ్ డైరెక్టర్ రోహిత్ తన మనసులోని మాటను బయటపెట్టాడు. దీపికాతో లేడీ సింగమ్ తరహా చిత్రాన్ని తెరకెక్కించాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నానని వెల్లడించాడు. ఆల్రెడీ తన మనసులో ఈ స్టోరీకి సంబంధించిన బలమైన ఆలోచన ఉందని తెలిపాడు. కానీ ఆ కథను స్క్కిప్ట్ గా చేంజ్ చేయడానికి కుదరలేదని పేర్కొన్నారు. కానీ తప్పకుండా దీపికా పదుకొణెతో లేడీ సింగమ్ తరహా చిత్రమైతే ఉంటుందని దర్శకుడు రోహిత్ శెట్టి ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ బాలీవుడ్ డైరెక్టర్ కామెంట్స్ వైరల్ అవ్వగా.. దీపికా అభిమానులు కూడా.. దీపికాను అలాంటి పాత్రలో చూడాలని ఉందంటూ నెట్టింట కామెంట్లు పెడుతున్నారు.

Next Story

Most Viewed