వైసీపీని గద్దె దించేందుకు.. రోడ్ మ్యాప్ సిద్ధం: సోము వీర్రాజు

by Vinod kumar |
వైసీపీని గద్దె దించేందుకు.. రోడ్ మ్యాప్ సిద్ధం: సోము వీర్రాజు
X

దిశ, ఏపీబ్యూరో: రాబోయే ఎన్నికల్లో వైసీపీని గద్దె దించేందుకు రోడ్‌మ్యాప్ సిద్ధం చేస్తున్నామని, బీజేపీ జనసేన కలిసి పోటీ చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. సాగునీటి ప్రాజెక్ట్‌లకు సంబంధించి రాబోయే రోజుల్లో ఆందోళన ఉధృతం చేస్తామని అన్నారు.


ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన తర్వాత కేంద్ర పన్నుల కింద రూ.24,500 కోట్లు ఇచ్చిందని చెప్పారు. 2020-21 నాటికి రూ.72,000 కోట్లు ఇచ్చిందని వెల్లడించారు. ఆ నిధులను వైసీపీ నవరత్నా కార్యక్రమాలకు వినియోగిస్తుందని మండిపడ్డారు. రాష్ట్రానికి కేంద్రం ఏమిచ్చిందో వైసీపీ మంత్రులతో బహిరంగ చర్చకు తాము సిద్ధమని సవాల్ చేశారు.


👉 Follow us on WhatsApp Channel
👉 Follow us on Sharechat


Next Story