'రామ్ సేతు' మూవీపై బీజేపీ ఎంపీ పిటిషన్

by srinivas |
రామ్ సేతు మూవీపై బీజేపీ ఎంపీ పిటిషన్
X

దిశ, సినిమా : బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నుస్రత్ బరుచా హీరో హీరోయిన్స్‌గా నటించిన 'రామ్ సేతు' మూవీపై తాజాగా బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి కోర్టులో పిటిషన్ వేశారు. రామ్ సేతును ఆధారంగా చేసుకుని రూపొందిస్తున్న ఈ మూవీలో.. రామ్ సేతును తప్పుగా చూపించే అవకాశం ఉందని, నిజాలను తారుమారు చేసేందుకు ఆస్కారం ఉందని ఆయన పేర్కొన్నారు. కాగా ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు వచ్చే వారంలో విచారణ జరపనుందని సమాచారం. అభిషేక్ శర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అరుణ్ భాటియా, విక్రమ్ మల్హో్త్రా, కీలక పాత్రల్లో కనిపించనున్నారు. దీపావళి కానుకగా రిలీజ్ కానున్న ఈ మూవీపై మరి కోర్టు ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. కాగా ప్రస్తుతం అక్షయ్ చేతిలో 'సెల్ఫీ', 'రామ్ సేతు', 'బడే మియా చోటే మియా' వంటి ప్రాజెక్టులు ఉన్నాయి.

Advertisement

Next Story

Most Viewed