- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ అసెంబ్లీ సెగ్మంట్‌పై బీజేపీ ఫోకస్..అధిష్ఠానం చూపు అతడి వైపే
దిశ ప్రతినిధి, రంగారెడ్డి: జిల్లాలోని రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల వేడి మొదలైంది. ముందోస్తు ఎన్నికలు వస్తాయనే ప్రచారంతో ఆయా పార్టీల నేతలు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే ఆశావహులు ఎవరి పద్ధతిలో వారు పెద్దఎత్తున కార్యక్రమాలు చేపడుతున్నారు. అంతేకాకుండా ఒకే పార్టీలో ముగ్గురు, నలుగురు ఆశావహులు ఉండటంతో ఎవరిదారి వారిదే అన్నట్లు సాగుతోంది.
ఈ దఫా రాజేంద్రనగర్ అసెంబ్లీని చేజిక్కించుకోవాలని బీజేపీ విశ్వ ప్రయాత్నాలు చేస్తోంది. ఇప్పటికే అధిష్టానం ఎమ్మెల్యే అభ్యర్థి మీరే.. పనిచేసుకుంటూ వెళ్లాలని ఓ నేతకు సూచించినట్లు సమాచారం. అధికార పార్టీలో ఉన్న లొసుగులు బీజేపీకి కలిసి వచ్చే అవకాశం ఉందని నేతలు భావిస్తున్నారు.
ఆశావహులు వీరే..
రాజేంద్రనగర్ అసెంబ్లీ టికెట్‌ను బీజేపీ నుంచి ముగ్గురు నేతలు ఆశిస్తున్నారు. అందులో ఒకరు బీజేపీ రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్, మరొకరు మణికొండ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ నరేందర్‌రెడ్డి, ఇంకొకరు మైలార్దేవరపల్లి కార్పొరేటర్తోకల శ్రీనివాస్‌రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది.
ఇందులో తొకల శ్రీనివాస్‌రెడ్డి క్షేత్రస్ధాయిలో పార్టీని బలోపేతం చేసుకుంటూ ప్రభుత్వ విధానాలను ఎక్కడిక్కడ ఎండగడుతూ కార్యక్రమాలు చేపడుతున్నారు. అంతేకాకుండా టీఎస్‌ఆర్ ఫౌండేషన్ఆధ్వర్యంలో ప్రతి కాలనీలో సమస్యలను, తాగునీటి ఇబ్బందులు తొలగిస్తున్నారు. ఎప్పుడూ ప్రజల్లో ఉంటూ.. వివిధ కార్యక్రమాల్లో తోకల శ్రీనివాస్‌రెడ్డి నిమగ్నమైయ్యారు.
అయితే మరో నేత బొక్క వేణుగోపాల్‌రెడ్డి టికెట్ఆశిస్తున్నప్పటికీ అధిష్ఠానం నమ్మకలేకపోతోంది. ఎందుకంటే స్థానిక ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌కు ప్రతిపక్ష అనుచరుడిగా ముద్రపడటంతో కొంత మైనస్అవుతోంది. ఇంకో నేత నరేందర్‌రెడ్డికి కొంత సానుభూతి ఉన్నప్పటికీ అధికార పార్టీ నేతలు, అధికారులతో కుమ్మక్కై మున్సిపాలిటీలో వ్యవహారం చేస్తున్నట్లు సమాచారం. దీంతో టీఆర్ఎస్ను విభేదించి బీజేపీలో చేరిన తోకల శ్రీనివాస్‌రెడ్డి వైపే బీజేపీ హై కమాండ్ చూస్తున్నట్లు తెలుస్తోంది.
టీఆర్‌ఎస్ అసమ్మతి కలిసోచ్చేనా..?
అధికార టీఆర్ఎస్పార్టీలో అంతర్గత వర్గపోరు పెరిగిపోవడంతో నాయకులు నువ్వా.. నేనా అనేలా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనైనా సత్తా చాటాలని బీజేపీ రాజేంద్రనగర్అసెంబ్లీ స్థానంపై కన్నెసింది. బలమైన అభ్యర్థితోపాటు స్థానికంగా పట్టున్న నేత అయితేనే గెలుపు సులభం అని బీజేపీ భావిస్తోంది. అందులో భాగంగానే మూడు దఫాలుగా కార్పొరేటర్‌గా పనిచేసిన తోకల శ్రీనివాస్‌రెడ్డికే టికెట్ కేటాయించాలని అధిష్ఠానం అభిప్రాయం వ్యక్తం చేస్తోంది.
మొదట కాంగ్రెస్‌పార్టీలో ఉన్న శ్రీనివాస్టీఆర్ఎస్లో చేరి కార్పొరేటర్‌గా గెలిచారు. స్థానిక ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్తమ్ముడు ప్రేమ్దాసు గౌడ్‌పై రెండుసార్లు గెలిచి సత్తా చాటారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఫ్వార్వార్డ్ బ్లాక్పార్టీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయినప్పటికీ బీజేపీ నుంచి కార్పొరేటర్‌గా గెలిచి ప్రజల మన్ననలు పొందుతున్నారు. ప్రస్తుతం నియోజకవర్గం మొత్తం పర్యటిస్తూ పార్టీని బలోపేతం చేస్తున్నారు.