- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
దివ్యాంగులకు త్వరలోనే బ్యాటరీ ట్రై సైకిల్స్: కేతిరెడ్డి వాసుదేవరెడ్డి
దిశ, తెలంగాణ బ్యూరో: దివ్యాంగులకు త్వరలోనే బ్యాటరీ ట్రై సైకిల్స్ అందజేయనున్నట్లు రాష్ట్ర వికలాంగుల సహకార సంస్థ చైర్మన్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని రాష్ట్ర వికలాంగుల సహకార సంస్థ కార్యాలయంలో మంగళవారం మేనేజింగ్ కమిటీ డైరెక్టర్స్‌తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్పొరేషన్ ద్వారా దివ్యాంగులకు ఇప్పటికే నిమ్స్, గాంధీ, హాస్పిటల్స్‌లో కొత్తగా వరంగల్ ఎం.జీ.ఎం హాస్పిటల్‌లో కృత్రిమ అవయవాలను అధునాతమైనవి అందించడం జరుగుతుందని, రోజురోజుకు వస్తున్న సాంకేతిక పరిజ్ఞానంతో అందజేయనున్నట్లు వెల్లడించారు.
కార్పొరేషన్‌లోని వికలాంగుల సహాయ ఉపకారణాల శిక్షణ, తయారీ కేంద్రాల(టీసీపీసీ) ద్వారా కొత్తగా బ్యాటరీ ట్రై సైకిల్స్, మున్సిపాలిటీలకు, గ్రామ పంచాయతీలకు చెత్త బండ్లను తయారు చేయడం జరుగుతుందన్నారు. అదే విధంగా కార్పొరేషన్ ఆవరణలో కొత్తగా ఆడిటోరియం నిర్మాణం చేయనున్నట్లు వెల్లడించారు. సంస్థ ఉద్యోగుల పీఆర్సీ, సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సమావేశంలో ప్రిన్సిపల్ సెక్రెటరీ దివ్య దేవరాజన్, జేఎండీ శైలజ, అధికారులు పాల్గొన్నారు.