బ్యాంకుల్లో తగ్గిన రూ. 100 కోట్లకు పైన మోసాలు!

by S Gopi |
బ్యాంకుల్లో తగ్గిన రూ. 100 కోట్లకు పైన మోసాలు!
X

ముంబై: బ్యాంకింగ్ రంగంలో రూ. 100 కోట్లకు పైన మోసాల సంఖ్య గణనీయంగా తగ్గాయని అధికారిక గణాంకాలు పేర్కొంటున్నాయి. బ్యాంకులు 2021-22లో 41,000 కోట్ల విలువైన మోసాలను నివేదించాయి. ఇది అంతకుముందు ఏడాదిలో జరిగిన రూ. 1.05 లక్షల కోట్ల విలువైన మోసాలతో పోలిస్తే సగానికి పైగా తగ్గాయి. గణాంకాల ప్రకారం, ప్రైవేట్, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మోసాల సంఖ్య 2020-21లో 265 నుంచి 2021-22లో 118కి తగ్గాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులకు సంబంధించి 2020-21లో రూ. 100 కోట్లకు పైన మోసాల సంఖ్య 167 నుంచి 80కి తగ్గింది.

ప్రైవేట్ రంగ బ్యాంకులకు సంబంధించి 98 నుంచి 38కి తగ్గాయి. విలువ పరంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో రూ. 65,900 కోట్ల నుంచి రూ. 28 వేల కోట్లకు, ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో రూ.39,900 కోట్ల నుంచి రూ. 13 వేల కోట్లకు తగ్గాయి. బ్యాంకు మోసాలనూ తగ్గించడానికి భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోంది. ముందస్తు హెచ్చరిక వ్యవస్థ సామర్థ్యాన్ని మెరుగుపరచడం, మోసాలపై స్ప్నదించే వ్యవస్థను బలోపేతం చేయడం, లావాదేవీల పర్యవేక్షణ కోసం గణాంకాలను విశ్లేషించడం, అంకితమైన మార్కెట్ ఇంటిలిజెన్స్ యూనిట్‌ను ప్రవేశపెట్టడం వంటి చర్యలు తీసుకుంటోంది.

Advertisement

Next Story