Shalini Pandey : కుర్రాళ్ల మతిపోగొడుతున్న 'అర్జున్ రెడ్డి' భామ

by Prasanna |
Shalini Pandey :  కుర్రాళ్ల మతిపోగొడుతున్న అర్జున్ రెడ్డి భామ
X

దిశ, వెబ్ డెస్క్ : ఈ మధ్య హీరోయిన్స్ కొత్త రూటును ఎంచుకుంటున్నారు. సినిమాల్లో అవకాశాల కోసం అందాలను ఆరబోయడానికి కూడా సిద్ధపడుతున్నారు. దీని బట్టే అర్ధం చేసుకోవాలి సినిమాల్లో ఛాన్స్ లు రావాలన్నా లక్కు కూడా ఉండాలి. ఒక మూవీ హిట్ అయితే వరుసగా అవకాశాలు వస్తాయి, అదే ఫ్లాప్ అయితే చాలా కష్టం. ఇలాంటి సమయాల్లో హీరోయిన్స్ ఫోటో షూట్స్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. దీని వలన క్రేజ్ మరింత పెంచుకుని అవకాశాలను అందుకుంటున్నారు. తాజాగా, 'అర్జున్ రెడ్డి ఫేమ్' భామ కూడా ఇదే ఫాలో అవుతుంది.

'అర్జున్ రెడ్డి ఫేమ్' నటి షాలిని పాండే ( Shalini Pandey ) మనందరికీ సుపరిచితమే. ఒకప్పుడు వరుస సినిమాలు చేసిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు కనిపించకుండా పోయింది. అయితే, సినిమాల్లో అవకాశాలు రాకపోయినా ఆమె అభిమానులకు కోసం సోషల్ మీడియాలో ఏదొక ఫోటోలు షేర్ చేస్తూనే ఉంది. తాజాగా, ఆమె పోస్ట్ చేసిన లేటెస్ట్ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఎప్పుడూ మోడ్రన్ డ్రెస్సుల్లో కనిపించే షాలిని చీరలో మెరిసి కుర్రాళ్ల మతిపోగొడుతుంది. వీటిని చూసిన ఆమె ఫ్యాన్స్ మీకు సినిమా అవకాశాలు రావాలని కోరుకుంటున్నామంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed