ఆఫీసులో స్ట్రెస్‌కు గురవుతున్నారా.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి..?

by Anjali |
ఆఫీసులో స్ట్రెస్‌కు గురవుతున్నారా.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి..?
X

దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా కొంతమంది ఆఫీసులో వర్క్ పరంగా ఒత్తిడి (stress)కి గురవుతుంటారు. పని ఉద్యోగుల మానసిక ఆరోగ్యాన్ని (Mental health) ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. ఎక్కువ గంటలు పని చేయడం వల్ల, ఉద్యోగ అభద్రత (Job insecurity), అధిక పనిభారం (Heavy workload), సహోద్యోగులతో లేదా ఉన్నతాధికారుల (superiors)తో విభేదాలు కారణంగా.. పని-వ్యక్తిగత జీవితాలను సమతుల్యంగా నిర్వహించడం వల్ల తీవ్రమైన ఒత్తిడికి గురవుతుంటారు.

రాత్రి సరిగ్గా నిద్ర లేకపోతే ఆఫీసులో పనితీరులో తగ్గుదల కనిపిస్తుంది. ఆందోళన (Anxiety), నిరాశ (depression), నిద్ర ఇబ్బందులు (sleep problems) ఎదుర్కొంటారు. పనిలో మీ ఒత్తిడికి కారణమయ్యే సమస్యల గురించి కుటుంబ సభ్యులు లేదా స్నేహితుడితో మాట్లాడటం వల్ల కాస్త రిలీఫ్ గా ఉంటుంది. ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు.

రకరకాల షిప్ట్‌లు కారణంగా కూడా మైండ్ స్ట్రెస్‌కు గురి అవుతుంటుంది. అలాగే (physical activity) కూడా ఒత్తిడికి లోనవుతుంటుంది. అయితే అలసట, ఒత్తిడి, టెన్సన్ (Tenson) పోవాలంటే ఈ సింపుల్ టిప్స్ పాటించాలంటున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

నిపుణులు చెప్పిన ఈ టిప్స్ పాటించడం వల్ల కేవలం స్ట్రెస్ నుంచి రిలీజ్ పొందడమే కాకుండా.. ఆరోగ్యంగా కూడా ఉంటారని నిపుణులు సూచిస్తున్నారు. రోజుకు తప్పకుండా ఎనిమిది గంటలు నిద్రపోవాలి. రెండు ఆఫీసుల్లో వర్క్ చేయడం మానుకోవాలి. అలాగే రాత్రి సమయంలో నిద్రపోకుండా మొబైల్ ఎక్కువ సేపు చూడకూడదు.

ధాన్యాలు (Grains), ఫ్రూట్స్ (fruits), కూరగాయలు (vegetables) తీసుకోవాలి. వీటిలో పోషకాలు దట్టంగా ఉంటాయి కాబట్టి.. శరీరానికి కావాల్సిన పోషకాలు అందిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇవి తీసుకోవడం వల్ల మనస్సు ఆరోగ్యం కూడా బాగుంటుంది. అలాగే ప్రతిరోజూ వ్యాయామం (exercise) తప్పకుండా చేయాలి. కనీసం ఇరవై నిమిషాల పాటు అయినా వ్యాయామం చేస్తే బాడీ ఫిట్‌గా ఉంటుంది.

వీటితో పాటుగా ధ్యానం (meditation) కూడా చేయాలి. ధ్యానం చేస్తే ఏకాగ్రత (Concentration) పెరుగుతుంది. మనస్సుకు ప్రశాంతంగా ఉంటుంది. ఆఫీసు నుంచి ఇంటికొచ్చాక.. ఫ్రెండ్స్‌ (friends)తో, ఫ్యామిలీ మెంబర్స్‌తో సమయం కేటాయించండి. కాస్త మైండ్ కు రిలీఫ్ గా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.

గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన సం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సంప్రదించగలరు.


Next Story

Most Viewed