- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
నూతన సంవత్సరం వేళ విదేశీ పర్యటనకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా.. తక్కువ ఖర్చయ్యే దేశాలివే?

దిశ, వెబ్‌డెస్క్: చాలా మంది కొత్త సంవత్సరం వేళ కొత్త కొత్త ప్రదేశాలకెళ్లి ఎంజాయ్ చేయాలని ప్లాన్ చేసుకుంటారు. అంతేకాకుండా ట్రావెలింగ్ అంటే ఇష్టపడేవారు కూడా ఎంతో మంది ఉంటారు. కానీ మనీ కోసం ఆలోచించి.. వెనకడుగేస్తారు. మరీ తక్కువ ఖర్చులతో విదేశీ పర్యటన వెళ్లేందుకు మీ కోసం కొన్ని ప్లేసెస్ అవేంటో ఇప్పుడు చూద్దాం..
శ్రీలంక..
మీ ఫ్యామిలీ మెంబర్స్‌తో మీరు అనుకున్న బడ్జెట్‌తోనే శ్రీలంక వెళ్లి రావచ్చు. ఇక్కడ బీచ్‌లు, పురాతన దేవాలయాలు, తేయాకు తోటలు మిమ్మల్ని ఎంతో ఆకట్టుకుంటాయి. శ్రీలంకకు వెళ్లేందుకు మీ టికెట్ ప్రైజ్ కేవలం 12 వేల రూపాయల నుంచి 18 వేల రూపాయల వరకు ఉంటుంది. అలాగే వసతి, స్థానిక రవాణా ఖర్చులు కూడా రోజుకు 2 వేల రూపాయల నుంచి రూ. 6 వేల వరకు ఖర్చు అవుతాయి.
ఇండోనేషియా..
ఇండోనేషియా నైట్ లైఫ్, అందైన బీచ్‌లు, దేవాలయాలకు ప్రసిద్ధి కాంచినది. చాలా మంది హానీమూన్ కోసం ఇక్కడికి వెళ్తుంటారు. ఇండోనేషియా వెళ్లేందుకు టికెట్ ప్రైజ్ రూ. 20 వేల నుంచి 25 వేల రూపాయల వరకు ఉంటుంది. అలాగే అక్కడ మిగతా ఖర్చుల కోసం రూ. 4500నుంచి రూ. 7500 వరకు ఖర్చు ఉంటుంది.
వియత్నాం..
వియత్నాను అందమైన దేశంగా చెప్పుకుంటారు. చాలా మంది ఇక్కడకు వెళ్లి.. సముద్రం ఒడ్డున సమయాన్ని గడుపుతారు. దీంతో మనసు ఉల్లాంగా ఉంటుంది. అక్కడ స్థానిక ఫుడ్ కూడా చాలా టేస్టీగా ఉంటుందని అంటుంటారు. మరీ వియత్నాకు వెళ్లాలంటే టికెట్ ధర చూసినట్లైతే.. రూ. 15 వేల నుంచి 20 వేల రూపాయల వరకు ఉంటుందట.
థాయ్ లాండ్..
థాయ్ లాండ్ వెళ్లేందుకు ఒక్కరి టికెట్ ధర 12 వేల రూపాయల నుంచి 18 వేల రూపాయల వరకు ఉంటుంది. కాగా మీరు కొత్త సంవత్సరం వేళ అక్కడి ప్రదేశాలు ఏం చక్కా చూసేయచ్చు.
నేపాల్..
న్యూయర్ వేళ మీరు నేపాల్ కు వెళ్లాలంటే మీ టికెట్ ధర కేవలం రూ. 7 వేల నుంచి 10 వేల రూపాయల వరకు ఉంటుంది. ఇతర ఖర్చులు కూడా 5 వేల వరకు అవుతాయి. ఈ అందమైన దేశంలో ట్రెక్కింగ్, అద్భుతమైన మంచు పర్వతాలను, ఆధ్యాత్మిక మఠాలను చూడొచ్చు.