Sugar levels: రాత్రిపూట ఈ తప్పులు చేస్తున్నారా.. ఈ వ్యాధి మరింత కొనితెచ్చుకున్నవారౌతారు..!!

by Anjali |   ( Updated:2024-11-23 10:01:48.0  )
Sugar levels: రాత్రిపూట ఈ తప్పులు చేస్తున్నారా.. ఈ వ్యాధి మరింత కొనితెచ్చుకున్నవారౌతారు..!!
X

దిశ, వెబ్‌డెస్క్: డయాబెటిస్(Diabetes) అని పిలవబడే ఈ వ్యాధి ఇన్స్యులిన్ హార్మోన్ లెవల్స్(Insulin hormone levels) తగ్గడం వల్ల కలిగే అనియంత్రిత మెటబాలిజం. అలాగే రక్తంలో అధిక గ్లూకోజ్ స్థాయి వంటి లక్షణాలతో కూడిన ఒక రుగ్మత. అతిమూత్రం(excessive urination) (పాలీయూరియా), చూపు మందగించడం(Blurred vision), ఎక్కువగా వాటర్ తాగాలనిపించడం, కారణం లేకుండా బరువు తగ్గడం(Weight loss), బద్ధకం(laziness) వంటివి డయాబెటిస్ ముఖ్య లక్షణాలు. ప్రస్తుత రోజుల్లో చాలా మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు.

డయాబెటిస్ లక్షణాలు పెరగడానికి కారణం..

అలాగే జీవన శైలిలో మార్పుల కారణంగా, చెడు ఆహారపు అలవాట్ల వల్ల డయాబెటిస్ లక్షణాలు తీవ్రంగా మారుతున్నాయి. అయితే డయాబెటిస్ వచ్చాక కూడా జీవన శైలిలో కొన్ని మార్పులు చేసుకోవాలి. కానీ చిన్న చిన్న పొరపాట్ల వల్ల షుగర్ లెవల్స్(Sugar levels) వేగంగా పెంచడానికి పనిచేస్తుంది. కాగా షుగర్ లెవల్స్ అదుపులో ఉండాలంటే ఈ రాత్రిపూట ఈ తప్పులు చేయవద్దని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

సరిపడ నిద్రలేకపోతే షుగర్ లెవల్స్ పెరిగే అవకాశం

డయాబెటిస్ పెషేంట్లు రాత్రి త్వరగా నిద్రపోకపోతే షుగర్ లెవల్స్ మరింత పెరిగే అవకాశం ఉంటుంది. తప్పకుండా 8 గంటల నిద్ర అవసరం. బాడీకి విశ్రాంతి ఇవ్వకపోతే డయాబెటిస్ మరింత పెరిగే చాన్స్ ఉంటుంది. తక్కువ నిద్ర కారణం చిరాకు(Irritation), ఒత్తిడి(stress), కార్టిసాల్ హార్మోన్ పెరగడం(Increased cortisol hormone) స్టార్ట్ అవుతుంది. దీంతో షుగర్ లెవల్స్ పెరుగుతాయి.

తిన్న తర్వాత వెంటనే పడుకుంటున్నారా?

షుగర్ పెషేంట్లు రాత్రి భోజనం తర్వాత వెంటనే దుప్పటి కప్పుకుని పడుకోకూడదు. చల్లటి వాతావరణంలో బాడీ చాలా బద్ధకంగా మారుతుంది. కాగా తిన్న తర్వాత తప్పకుండా 30 నిమిషాల పాటు వాకింగ్(walking) చేయాలి. అలాగే భోజనం అనంతరం షుగర్ పెషేంట్లు కాఫీ, టీ తాగడం, స్వీట్స్ తినడం మానేయాలి. ముఖ్యంగా ఇవి చక్కెర స్థాయిలు పెంచడానికి దారితీస్తుంది.

రాత్రి పూట ఈ ఆహార పదార్థాలు తీసుకుంటున్నారా?

కాగా షుగర్ వ్యాధిగ్రస్తులు(Diabetics) ప్రతిరోజూ ఒకే సమయానికి భోజనం చేయడం మేలు. కానీ నూనె పదార్థాల(Oil ingredients)తో పాటు కార్బోహైడ్రేట్ల(carbohydrates)తో కూడిన పదార్థాలు తినవద్దు. లైట్ ఫుడ్ తీసుకోవాలి. ముఖ్యంగా వైట్ రైస్‌(White rice), బంగాళాదుంపల(Potatoes)కు దూరంగా ఉండాలి.

చలికాలమని వాటర్ తక్కువగా తాగుతున్నారా?

చలికాలంలో వాతావరణం చల్లగా ఉంటుంది. కాగా ఎక్కువగా దాహం వేయదు. దీంతో ఎక్కువగా వాటర్(Water) తీసుకోరు. కానీ నీళ్లు తక్కువగా తాగితే బాడీలో గ్లూకోజ్ స్థాయిలు పెరుగుతాయి. కాగా ప్రతిరోజూ తప్పకుండా వీలైనంత ఎక్కువగా వాటర్ తీసుకోవడం పూర్తి ఆరోగ్యానికి మంచిది.



Read More..

ఈ టాబ్లెట్‌ను అతిగా వాడుతున్నారా..? ఇది తప్పక తెలుసుకోండి!


Advertisement

Next Story

Most Viewed