'మాచర్ల నియోజకవర్గం'లో నితిన్‌-అంజలి రొమాన్స్..

by S Gopi |   ( Updated:2022-07-03 12:39:38.0  )
మాచర్ల నియోజకవర్గంలో నితిన్‌-అంజలి రొమాన్స్..
X

దిశ, సినిమా : టాలీవుడ్ యువ నటుడు నితిన్, కృతి శెట్టి, క్యాథరిన్ థ్రేసా నటిస్తున్న సినిమా 'మాచర్ల నియోజకవర్గం'. ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ మూవీ.. టైటిల్ అనౌన్స్ చేసినప్పటి నుంచే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. రిలీజైన పోస్టర్స్, గ్లింప్స్‌ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక ప్రస్తుతం ఈ మూవీ నుంచి మరో ఖతర్నాక్ అప్డేట్ వచ్చింది. ఈ చిత్రంలో హీరోయిన్ అంజలి స్పెషల్ సాంగ్‌ చేయబోతుందని తెలుస్తోంది. ఇందుకు సంబందించిన షూట్ కూడా కంప్లీట్ అయిందని సమాచారం. ఇక దీనికి సంబందించిన పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో అంజలి హాట్ లుక్స్‌తో కుర్రాళ్లకు మత్తెక్కిస్తోంది. ఇకపోతే ఈ చిత్రం ఆగష్టు 12న థియేటర్లలో రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది.

Advertisement

Next Story