15 నిమిషాల సెర్చ్ హిస్టరీ డిలీట్ చేసే అవకాశం!

by Harish |
15 నిమిషాల సెర్చ్ హిస్టరీ డిలీట్ చేసే అవకాశం!
X

దిశ, ఫీచర్స్ : ఇప్పుడు ఏ చిన్న సమాచారానికైనా గూగుల్ సెర్చ్‌పైనే ఆధారపడుతున్నాం. అయితే, మనం వెతికిన విషయాలు ఇతరులకు తెలియకుండా ఉండేందుకు లేదా గోప్యత కోసం సెర్చ్ హిస్టరీని డిలీట్ చేస్తుంటాం. ఈ క్రమంలోనే 'లాస్ట్ 15 మినిట్స్' పేరుతో ఆండ్రాయిడ్ యూజర్స్ తమ సెర్చ్ హిస్టరీ లోని చివరి 15 నిమిషాలను డిలీట్ చేసుకునేలా కొత్త అప్‌డేట్ తీసుకొచ్చింది గూగుల్.

ఐవోఎస్ డివైజెస్‌లో ఈ అప్‌డేట్‌‌ను 2021లోనే ప్రవేశపెట్టిన గూగుల్.. ఆండ్రాయిడ్‌ వెర్షన్‌కు ఇటీవలే ఆ అవకాశాన్ని కల్పించింది. అయితే అందరికీ అందుబాటులోకి వచ్చేందుకు కొద్ది వారాల సమయం పట్టనుంది. ఈ మేరకు డిఫాల్ట్ Google సెర్చ్ యాప్‌లో యూజర్లు పాప్-అప్ మెనూ ఓపెన్ చేయగానే అక్కడ చివరి 15 నిమిషాల సెర్చ్ హిస్టరీని తొలగించే ఆప్షన్ కనిపిస్తుంది. ప్రస్తుతం మాత్రం గూగుల్‌లో గంట, ఒక రోజు, వారం, నెల లేదా మొత్తం హిస్టరీని మాన్యువల్‌గానే డిలీట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలో 3, 18 లేదా 36 నెలల ఓల్డ్ హిస్టరీని ఆటోమేటిక్‌గా క్లియర్ చేసే ఆప్షన్‌ను కూడా అందించింది. అయితే ఈ ఫీచర్ డెస్క్‌టాప్ వెర్షన్‌లో ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో గూగుల్ పేర్కొనలేదు.

Advertisement

Next Story

Most Viewed