మహిళలందరికీ హ్యాపీ ఫూల్స్ డే : అనసూయ

by Mahesh |
మహిళలందరికీ హ్యాపీ ఫూల్స్ డే : అనసూయ
X

దిశ, సినిమా : ప్రముఖ తెలుగు నటి అనసూయ భరద్వాజ్ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని స్పెషల్ ట్వీట్ పోస్ట్ చేసింది. సమాజంలో ఉన్న కొంతమంది పురుషులకు ఈ ప్రత్యేక రోజునే మహిళలపై ఎక్కడలేని గౌరవం పుట్టుకొస్తుందంటూ కౌంటర్ వేసింది. అంతేకాదు ఈ ఒక్క రోజుకు పరిమితమయ్యే గౌరవాన్ని స్వీకరిస్తే అతివలంతా అవివేకులు అవుతారని సెలవిచ్చింది. ట్వీట్ విషయానికొస్తే.. 'ఓ.. ప్రతి ట్రోలర్, మీమ్ మేకర్ ఈ రోజు హఠాత్తుగా, అకస్మాత్తుగా మహిళలను గౌరవించాలని గ్రహించారు. కానీ ఈ రెస్పెక్ట్ 24 గంటల్లో ముగుస్తుంది. కాబట్టి స్త్రీలందరికీ హ్యాపీ ఫూల్స్ డే' అంటూ సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచింది.

Advertisement

Next Story