- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫేస్‌బుక్ సీఈవోకు రోబో టెస్ట్.. మనిషేనని నిరూపించే ప్రయత్నం
దిశ, ఫీచర్స్: మెటా సీఈవో, ఫేస్‌బుక్ ఫౌండర్ మార్క్ జుకర్‌బర్గ్‌కు ఫన్నీ ఇన్సిడెంట్ ఎదురైంది. టెక్ దిగ్గజ కంపెనీకి అధినేత అయిన మార్క్.. తన వర్క్ షెడ్యూల్స్‌కు సంబంధించి సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ ఎదుర్కొంటాడని తెలిసిందే. అతని లైఫ్ స్టైల్ రోబోను తలపిస్తుందని నెటిజన్లు తరచూ జోక్స్ పేలుస్తుంటారు. అయితే ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జుకర్ ఎదుట ఇవే ప్రశ్నలు ప్రస్తావించాడు హోస్ట్.
పాడ్‌కాస్టర్, కంప్యూటర్ సైంటిస్ట్ లెక్స్ ఫ్రిడ్‌మాన్.. జుకర్‌బర్గ్‌ను సరదాగా ఒక CAPTCHA పూర్తిచేయమని అడిగారు. ఆన్‌లైన్ యాక్టివిటీ ప్రారంభించే ముందు సదరు యూజర్ రోబో కాదు మనిషేనని నిర్దారించుకునేందుకు పలు ఇమేజ్‌లతో కూడిన ఇలాంటి పజిల్ పరిష్కరించ మంటుంది కంప్యూటర్. ఇక్కడ ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తి కూడా జుకర్‌ను రోబో కాదని నిరూపించుకునేందుకు పేపర్‌పై ట్రాఫిక్ లైట్స్ మార్క్ చేయాల్సిందిగా సూచించడం నవ్వులు పూయించింది. అయితే మార్క్ సైతం ఈ టాస్క్‌ను సరదాగానే పూర్తిచేయడం విశేషం. ఈ ఫన్నీ వీడియోను ఇన్‌సైడర్ ఇన్‌స్టా పేజీలో పోస్టు చేయగా.. ఇంతకీ టెస్ట్ పాస్ అయ్యాడా? అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. అయితే ప్రపంచంలోని ట్రాఫిక్ లైట్ల డేటా మొత్తం అతని వద్దే ఉన్నందున ఈజీగా పాస్ అయ్యుంటాడని రిప్లయ్ ఇస్తున్నారు.