- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సూపర్ హ్యూమన్ స్కిల్స్.. రికార్డ్స్ కొల్లగొడుతున్న అమ్మాయి
దిశ, ఫీచర్స్ : రెండు చేతులతో ఒకే వేగంతో రాయగల సామర్థ్యం ప్రపంచ జనాభాలో ఒక శాతం వ్యక్తులకే సాధ్యం. అందుకే వారిని సవ్యసాచిగా పిలుస్తుంటారు. అటువంటి అరుదైన వ్యక్తుల్లో కర్నాటకకు చెందిన 17 ఏళ్ల ఆది స్వరూప కూడా ఒకరు. తన 'అంబిడెక్‌స్ట్రస్' కళతో రికార్డులు కొల్లగొడుతున్న స్వరూప.. కళ్లకు గంతలు కట్టుకుని, వ్యతిరేక దిశలతో సహా 11 రకాలుగా తన రెండు చేతులతో ఏకకాలంలో రాయగలదు. ఆమె ప్రతిభ చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతుండగా.. ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.
మంగళూరు నివాసి ఆది స్వరూప ఒకే సమయంలో ఇంగ్లీష్ , కన్నడ భాషల్లో రాయగలదు. గతంలో ఒక్క నిమిషంలో ఏక దిశలో 45 పదాలను రాసినందుకు లతా ఫౌండేషన్ ప్రత్యేక ప్రపంచ రికార్డు ద్వారా ఆమె పేరు పొందింది. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన ఈ యువతి రాబోయే సంవత్సరాల్లో కనీసం ఒక్క గిన్నిస్ వరల్డ్ రికార్డునైనా బ్రేక్ చేయాలని ఆకాంక్షిస్తోంది. ఇటీవల ఆమె తన రెండు చేతులతో విభిన్న శైలిలో రాసిన వీడియో వైరల్ కాగా.. నెటిజన్లు ఆమె టాలెంట్‌ను బొమన్ ఇరానీ పోషించిన డాక్టర్ వీరూ సహస్త్రబుద్ధే@ వైరస్ పాత్రతో పోలుస్తున్నారు.
చాలా మంది పిల్లల మాదిరిగా కాకుండా స్వరూప తన తల్లిదండ్రులు నిర్వహించే స్వరూప అధ్యయన కేంద్రంలో చదువుకుంది. 2021లో ఎక్స్‌టర్నల్ క్యాండిడేట్‌లా 10వ తరగతి బోర్డు పరీక్షకు హాజరైంది. అదే ఏడాది ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్.. 'లైన్ ఆర్ట్ ద్వారా పదాలను సూచించే సామర్థ్యమున్న అద్భుతమైన విజువల్ మెమరీ ఆర్టిస్ట్‌గా' తనకు అవార్డు ఇచ్చింది. రాయడంలోనే కాదు బొమ్మలు గీయడంలోనూ ఆమెకు ఆమె సాటి. స్వరూప తరచూ తను వేసే ఆర్ట్‌వర్క్‌ను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేస్తుంది. ఆమె పండిట్ రవికిరణ్ ద్వారా హిందుస్తానీ సంగీతంలో శిక్షణ పొందగా, యక్షగాన(సాంప్రదాయ కన్నడ థియేటర్) కళాకారిణిగా 50కి పైగా ప్రదర్శనలు ఇవ్వడం విశేషం.